Home > EDUCATION > UNIVERSITIES NEWS > PSTUCET – తెలుగు వర్సిటీ అడ్మిషన్స్ గడువు పెంపు

PSTUCET – తెలుగు వర్సిటీ అడ్మిషన్స్ గడువు పెంపు

BIKKI NEWS (AUG. 27) : Potti sriramulu university admissions 2024 date extended. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నిర్వహిస్తున్న వివిధ కోర్సుల్లో చేరడానికి ప్రవేశ దరఖాస్తుల గడువును ఆగస్టు 31వరకు పొడిగించారు.

Potti sriramulu university admissions 2024 date extended

పీజీ, యూజీ, పీజీ డిప్లొమా, డిప్లొమా, సర్టిఫికెట్ స్థాయిలో శిల్ప చిత్రలేఖనం, డిజైన్, సంగీత, రంగ స్థలం, నృత్యం, జానపదం, తెలుగు, చరిత్ర – పర్యాటకం, భాషా శాస్త్రం, జర్నలిజం, జ్యోతిషం, యోగా కోర్సులను నిర్వహిస్తున్నారు.

ఈ కోర్సుల్లో ప్రవేశానికి గడువు ఆగస్టు 25 వరకు ఉండేది. కానీ విద్యార్థుల విజ్ఞప్తి మేరకు ప్రవేశాల గడువును ఈ నెల 31వ తేదీ వరకు పొడిగించినట్లు వర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య భట్టు రమేశ్ ఒక ప్రకటనలో తెలిపారు.

కోర్సులు, కాల పరిమితి, ఫీజు తదితర వివరాల కోసం తెలుగు వర్సిటీ వెబ్సైట్ను సంప్రదించాలని సూచించారు.

వెబ్సైట్ : https://www.pstucet.org/

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు