BIKKI NEWS (JUNE 21) : POSTAL GDS JOB NOTIFICATION 2024. ఇండియన్ పోస్ట్ దేశవ్యాప్తంగా ఉన్న సర్కిలలో భారీగా ఉద్యోగాలు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ సిద్ధం చేసింది. దాదాపు 50 వేల గ్రామీణ్ డాక్ సేవక్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన త్వరలో వెలువడనుంది.
POSTAL GDS JOB NOTIFICATION 2024
ఎలాంటి రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండా కేవలం పదో తరగతిలో వచ్చిన మార్కులు మరియు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
గ్రామీణ డాక్ సేవక్, బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ వంటి పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తారు.
వయోపరిమితి 18 నుండి 40 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ ఆధారంగా వయోపరిమితి సడలింపు కలదు.
వేతనం ప్రారంభంలో 10వేల రూపాయల నుండి 12 వేల రూపాయల మధ్య ఉంటుంది. పదోన్నతులు ద్వారా ఉన్నత స్థానాలకు చేరవచ్చు.
ఇండియన్ పోస్టల్ పేమెంట్స్ బ్యాంకు సర్వీసులు ద్వారా ఇన్సెంటివ్ లు పొందవచ్చు. గతేడాది ఈ పోస్టుల భర్తీ కోసం 40,889 ఖాళీలను భర్తీ చేశారు. ఈ ఏడాది 50 వేలకు పైచీలుకు ఖాళీలు ఉన్నట్లు సమాచారం.
అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. తమ ప్రాంతానికి చుట్టు పక్కల ఉన్న పోస్ట్ ఆఫీస్ లలో పని చేయటానికి ఆప్షన్లు పెట్టుకోవలసి ఉంటుంది. మెరిట్ ఆధారంగా దగ్గర్లోని పోస్ట్ ఆఫీస్ లో పోస్టింగ్ ఇస్తారు.
పోస్టల్ డిపార్ట్మెంట్ కేంద్ర ప్రభుత్వ శాఖ. కావున ఇందులో పనిచేసే ఉద్యోగాలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలుగా గుర్తింపు ఉంటుంది.
దరఖాస్తు చేసుకున్న పిమ్మట పదో తరగతిలో సాధించిన మార్కులు మరియు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా దశలవారీగా ఫలితాలను వెల్లడి చేస్తుంటారు. కావున ఎప్పటికప్పుడు కింద ఇవ్వబడిన వెబ్సైట్ ను ఫాలో అవుతూ ఉండాలి