Home > EDUCATION > POLYTECHNIC > POLYCET 2025 – పాలిసెట్ పీటముడి

POLYCET 2025 – పాలిసెట్ పీటముడి

BIKKI NEWS (JULY 07) : Polycet seat allotment issue in telangana. తెలంగాణ పాలిసెట్ కౌన్సిలింగ్ ప్రక్రియలో సీట్ల కేటాయింపు ప్రక్రియ గందరగోళంలో పడింది. షెడ్యూల్ ప్రకారం జులై 4వ తేదీన విద్యార్థులకు తొలి విడత పాలిసెట్ సీట్లను కేటాయించాల్సి ఉంది.

Polycet seat allotment issue in telangana

అయితే ఇంతవరకు పాలిసెట్ సీట్ల కేటాయింపు జరపలేదు మరియు ఎప్పుడు కేటాయిస్తామని అధికారిక ప్రకటన కూడా సాంకేతిక విద్యా విభాగం నుండి రాలేదు.

పాలీసెట్ ప్రవేశాల కోసం విద్యార్థులు పెట్టుకున్న వెబ్ ఆప్షన్ లో డేటా డిలీట్ అయిందని మీడియాలో వార్తలు వస్తున్నాయి. వీటి మీద ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. డేటా రికవరీ కోసం నిపుణుల సహాయంతో సాంకేతిక విద్యా మండలి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం

అయితే పాలీసెట్ ఫీజుల వ్యవహారమే సీట్ల కేటాయింపు ఆలస్యానికి కారణమని అధికారులు అంటున్నారు. ప్రైవేట్ కాలేజీలలో ఫీజు 39 వేల రూపాయలుగా ప్రభుత్వం నిర్ణయించిందని. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ కింద 15,000/- ఇస్తుంది కానీ మిగిలిన 24 వేల విద్యార్థులు చెల్లించాలా.? ప్రభుత్వమే రియింబర్స్ చేస్తుందా అనే విషయంపై స్పష్టత రాలేదని, స్పష్టత రాగానే సీట్లు కేటాయింపు పూర్తి చేస్తామని తెలిపారు.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు