BIKKI NEWS (OCT. 08) : Physics Nobel 2024 won by john j hopfield and jeffery E Hinton. కృత్రిమ న్యూరో నెట్‌వర్క్ ద్వారా మెషీన్ లెర్నింగ్‌కుసంబంధించిన వ్యవస్థీకృత ఆవిష్కరణలను డెవలప్ చేసిన జాన్ జే హోప్‌ఫీల్డ్, జెఫరీ ఈ హింటన్ లు ఫిజిక్స్ లో నోబెల్ బహుమతి గెలుచుకున్నారు. ఇప్పటి వరకు 224 మందికి ఫిజిక్స్‌లో నోబెల్ ఇచ్చారు.
Physics Nobel 2024 won by john j hopfield and jeffery E Hinton
భౌతిక శాస్త్రంలోని ప్రామాణికమైన నిర్మాణాత్మక విధానాల ద్వారా శక్తి వంతమైన మెషీన్ లెర్నింగ్ టెక్నిక్‌లను సృష్టించినట్లు నోబెల్ కమిటీ తెలిపింది. సమాచారాన్ని స్టోర్ చేసి, రీ కన్‌స్ట్రక్ట్ చేసే విధానాన్ని జాన్ హోప్‌ఫీల్డ్ సృష్టించినట్లు కమిటీ వెల్లడించింది. డేటాలో ఉన్న వివిధ ప్రాపర్టీల గురించి జెఫ్రీ హింటన్ ఓ విధానాన్ని డెవలప్ చేశారు. ఆ విధానం ద్వారా ప్రస్తుతం వినియోగంలో ఉన్న కృత్రిమ న్యూరల్ నెట్వర్క్‌ను అమలు చేయవచ్చు అని కమిటీ తెలిపింది.
గత ఏడాది ఫిజిక్స్‌లో ముగ్గురికి నోబెల్ పురస్కారం దక్కింది. 2023లో శాస్త్రవేత్తలు అన్నే ఎల్ హుయిలైర్, పీరీ అగోస్టిని, క్రాజ్‌లు ఆ అవార్డు అందుకున్నారు. ఎలక్ట్రాన్ల వేగంపై అధ్యయనం చేసినందుకు వాళ్లకు ఆ బహుమతి దక్కింది. కణంలోని చిన్న ఎలక్ట్రాన్లు ఎలా కేంద్రకం చుట్టు భ్రమిస్తాయన్న విషయాన్ని వాళ్లు తేల్చారు.