BIKKI NEWS (APRIL 21) : నాలుగేళ్ల డిగ్రీ పూర్తి చేసుకున్న వాళ్లు నేరుగా పిహెచ్డి చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నట్లు (PhD with 4 years degree by ugc net) యూజీసీ చైర్మన్ మామిడాల జగదీష్ కుమార్ ప్రకటించారు. దీనికోసం నాలుగేళ్ల డిగ్రీ విద్యార్థులు పిహెచ్డి చేయడానికి యుజిసి నెట్ పరీక్ష రాయవలసి ఉంటుందని పేర్కొన్నారు. గతంలో యుజిసి నెట్ పరీక్ష రాయాలి అంటే సంబంధించిన సబ్జెక్టు లో పీజీ పూర్తి చేసి ఉండాల్సి ఉండేది.
అయితే యుజిసి నెట్ 2024 జూన్ సెషన్ నుండి నాలుగేళ్ల డిగ్రీ చదువుతున్న ఫైనల్ సెమిస్టర్ అభ్యర్థులు, డిగ్రీ పూర్తి చేసుకున్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులుగా ప్రకటించారు. అయితే వీరికి నాలుగేళ్ల డిగ్రీలో 75% మార్కుల లేదా తత్ సమాన గ్రేడ్ ను కలిగి ఉండాలని పేర్కొన్నారు. రిజర్వేషన్ల ఆధారంగా 5 శాతం మార్కుల సడలింపు కూడా ఉందని మామిడాల జగదీష్ కుమార్ ప్రకటించారు.
ఈ అభ్యర్థులు ఏ సబ్జెక్టులో అయినా పిహెచ్డి చేయడానికి అవకాశం ఉందని పేర్కొన్నారు.