OU JOBS : ఉస్మానియా యూనివర్సిటీలో పార్ట్ టైం లెక్చరర్లు

హైదరాబాద్ (సెప్టెంబర్ – 13) : ఉస్మానియా యూనివర్సిటీలో తాత్కాలిక ప్రాతిపదికన 15 టీచింగ్ ఉద్యోగాలు (part time lecturer jobs in osmania university) భర్తీకి డైరెక్టర్ ఆఫీస్ (జిల్లా పీజీ కాలేజీలు) నోటిఫికేషన్ విడుదల చేసింది.

అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు సెప్టెంబర్ 15వ తేదీ సాయంత్రం ఐదు గంటల లోపు లో ప్రత్యక్షంగా దరఖాస్తు చేసుకోవచ్చు.

మొత్తం ఖాళీలు: 15

ఎంఏ ఎకనామిక్స్ – 1
ఎమ్మెస్సీ- మ్యాథ్స్ – 1
ఎమ్మెస్సీ కెమిస్ట్రీ – 12
ఎంబీఏ – 1
ఎంసీఏ – 1

అర్హతలు : సంబంధిత విభాగంలో ఎంఏ ఎంఎస్సీ వారు 55% ఎంబీఏ ఎంసీఏ దరఖాస్తు చేసుకునేవారు 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి అలాగే నెట్/ సెట్/ స్లెట్/ పీహెచ్డీ కలిగి ఉండాలి.

ఎంపిక విధానం : రాత పరీక్ష 50 మార్కులకు మరియు ఇంటర్వ్యూ 50 మార్కులకు నిర్వహించబడును

దరఖాస్తు విధానం : ఆఫ్లైన్ లో పూర్తి బయోడేటా ఫామ్ తో పాటు సంబంధిత సర్టిఫికెట్ల జిరాక్స్ ఎట్లను తీసుకుని ఆఫీస్ ఆఫ్ ది డైరెక్టర్ – డిస్ట్రిక్ట్ పీజీ కాలేజెస్ ఆవరణలో సమర్పించాలి

చివరితేదీ: సెప్టెంబర్ 15 సాయంత్రం 5.00 గంటల వరకు

వెబ్సైట్: https://www.osmania.ac.in