Home > NATIONAL > PAHALGAM ATTACK – పాకిస్థాన్ తో సంబంధాలపై కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్రం

PAHALGAM ATTACK – పాకిస్థాన్ తో సంబంధాలపై కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్రం

BIKKI NEWS (APR. 23) : Pahalgam attack – union cabinet decisions. పహల్గామ్ లో ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో నరేంద్ర మోదీ నేతృత్వంలో ఈరోజు జరిగిన కేబినెట్ కమిటీ (సీసీఎస్) సమావేశంలో పాకిస్థాన్ తో సంబంధాలపై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ మేరకు విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి వివరాలు వెల్లడించారు.

Pahalgam attack – union cabinet decisions.

వాటిలో ముఖ్యమైనవి సింధూ జలాల ఒప్పందం రద్దు, పాకిస్థాన్ పౌరులకు ఇండియా లోకి ప్రవేశం రద్దు, సరిహద్దు లోని అటారీ చెక్ పోస్ట్ మూసివేత, భారత్ లో ఉన్న పాకిస్థాన్ దౌత్య అధికారులు పంపివేత వంటివి ఉన్నాయి.

సింధూ జలాల ఒప్పందం రద్దు :

1960 నాటి సింధు జలాల ఒప్పందాన్ని తక్షణం తాత్కాలికంగా నిలుపుదల చేస్తున్నట్లు ప్రకటించారు.

పాకిస్థాన్ పౌరులకు ప్రవేశం లేదు :

పాకిస్తాన్ పౌరులను భారతదేశంలోకి ఇకనుంచి అనుమతించేది లేదని, గతంలో పాకిస్తానీయులకు జారీచేసిన ప్రత్యేక వీసాలు వెంటనే రద్ద చేస్తున్నట్లు, . ప్రత్యేక వీసా కింద భారత్‌లో ఉన్న పాకిస్తానీయులు 48 గంటల్లో దేశం విడిచి వెళ్లాలని తీర్మానం చేశారు

దౌత్య అధికారుల ఉపసంహరణ :

దిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్‌లో ఉన్న రక్షణ, సైనిక, నేవీ, వైమానిక సలహాదారులు 7 రోజుల్లో దేశం విడిచి వెళ్లాలి‌, అలాగే పాకిస్తాన్‌ రాజధాని ఇస్లామాబాద్‌లో ఉన్న భారత హైకమిషన్ కార్యాలయంలో ఉన్న ఇదే హోదా గల భారత ఉద్యోగులను వెనక్కు రావాలని ఆదేశించారు.

అటారీ చెక్ పోస్ట్ మూసివేత :

ఇండియా – పాకిస్తాన్ సరిహద్దులో ఉన్న అటారీ చెక్‌పోస్ట్‌ను వెంటనే మూసివేస్తున్నట్లు ప్రకటించింది. భారత్ వైపు నుంచి సరైన పత్రాలతో వెళ్లినవారు కూడా ఈ ఏడాది మే 1 లోపు తిరిగి రావాల్సి ఉంటుంది.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు