OU NEWS : ఓయూ ఇంజినీరింగ్ కళాశాలకు 10 ఏళ్ల అటనామస్

హైదరాబాద్ (జూలై – 10) : ఉస్మానియా విశ్వ విద్యాలయంలోని ఇంజినీరింగ్ కళాశాల పదేళ్ల పాటు అటానమస్ హోదా కల్పిస్తూ యూజీసీ ఉత్తర్వులు జారీచేసింది.

1917లో స్థాపించిన ఈ కళాశాలకు గతంలో రెండుసార్లు ఆరేళ్ల చొప్పున అటానమస్ గుర్తింపు దక్కింది. తాజాగా మూడోసారి ఆ గుర్తింపు రావడంతో పదేళ్ల పాటు స్వయం ప్రతిపత్తి ఇస్తూ యూజీసీ నిర్ణయం తీసుకొంది.

ఓయూకు న్యాక్ ఏ ప్లస్ గుర్తింపు ఉండటం, ఇంజినీరింగ్ కళాశాలలో అన్ని బ్రాంచీలకు ఆరేళ్లపాటు నేషనల్ బోర్డు ఆఫ్ అక్రిడిటేషన్ (ఎన్బీఏ) గుర్తింపు సాధించడం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొన్న యూజీసీ అధికారులు
కళాశాలను స్వయంగా పరిశీలించకుండానే పదేళ్లపాటు అటానమస్ హోదా ఇవ్వడం విశేషం.

గత విద్యాసంవత్సరం (2022-23) నుంచి 2031-32 వరకు గుర్తింపు ఉంటుంది. దేశంలో అంతకాలం అటానమస్ పొందిన కళాశాలలు చాలా తక్కువ. కళాశాల ప్రిన్సిపాల్ శ్రీరాం వెంకటేశ్ మాట్లాడుతూ స్వయంప్రతిపత్తి వల్లకోర్సులు, సిలబస్ రూపకల్పన అంశాల్లో కళాశాలకు స్వేచ్చ ఉంటుందని, పరిశోధన ప్రాజెక్టుల్లో ప్రాధాన్యం దక్కుతుందన్నారు.