JOBS : ఇండియా సెక్యూరిటీ ప్రెస్ లో ఉద్యోగాలు

హైదరాబాద్ (జూలై – 10) : నాసిక్ లోని భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన ఇండియా సెక్యూరిటీ ప్రెస్ (ISP) లో ఐటీఐ అర్హతతోనే 108 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

1925లో ఏర్పాటుచేసిన ఇండియా సెక్యూరిటీ ప్రెస్ పాస్‌పోర్టు, ఇతర ప్రయాణ డాక్యుమెంట్లు, పోస్టేజ్ స్టాంపులు, పోస్ట్ కార్డులు, ఇన్లాండ్ లెటర్లు, ఎన్వెలప్ లు, నాన్ జ్యుడీషియల్, రెవెన్యు స్టాంపులు మొదలైనవి ముద్రిస్తారు.

◆ ఖాళీల వివరాలు : తాజా నోటిఫికేషన్ లో టెక్నికల్,
స్టూడియో, స్టోర్, టర్నర్, మెషినిస్ట్ గ్రైండర్, ఫిట్టర్, ఎలక్ట్రికల్ విభాగాల్లో 108 ఖాళీలు
ఉన్నాయి.

వెల్ఫేర్ ఆఫీసర్-1, జూనియర్ టెక్నీషియన్ (టెక్నికల్)-41, కంట్రోల్-41, స్టూడియో-04, స్టోర్-04, సీఎస్ఓ-05, టర్నర్-01, మెషినిస్ట్ గ్రైండర్-01, వెల్డర్-01, ఫిట్టర్-04, ఎలక్ట్రిషియన్-02, ఎలక్ట్రానిక్-03..

◆ ఎంపిక విధానం :ఆన్లైన్ పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు.

1) వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టుకు డిగ్రీ పాసై.. మరాఠీ భాష తెలిసి ఉండాలి. ఏదైనా సంస్థ పరిశ్రమలో వెల్ఫేర్ ఆఫీసర్/ పర్సనల్ ఆఫీసర్/ హెల్తేర్ ఎగ్జిక్యూటివ్ గా రెండేళ్ల
ఉద్యోగానునుభవం ఉండాలి.

◆ వయసు : 31.07.2023 నాటికి 18-30 ఏళ్లు ఉండాలి.

◆ నెలకు వేతనం : రూ.29,740- రూ. 1,03,000

2) జూనియర్ టెక్నీషియన్ పోస్టుకు సంబంధిత విభాగంలో ఫుల్ టైమ్ ఐటీఐ సర్టిఫికెట్/ ప్రింటింగ్ టెక్నాలజీ డిప్లొమా పాసవ్వాలి.

◆ వయసు : 31.07. 2023 నాటికి 25 సంవత్సరాలు మించకూడదు.

◆ వేతనం నెలకు రూ.18,780 – 67,390.

◆ గరిష్ట వయసులో ఎస్సీ/ ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్ల సడలింపు ఉంటుంది. హారిజాంటల్ రిజర్వేషన్ కింద.. పీడబ్ల్యూడీలకు 4, ఎక్స్-సర్వీస్ మెన్ కు 10 పోస్టులను కేటాయించారు.

◆ దరఖాస్తు విధానం : ఆన్లైన్

◆ దరఖాస్తు గడువు : జూలై 31- 2023

◆వెబ్సైట్ : https://ispnasik.spmcil.com