BIKKI NEWS (APR. 18) : Osmania University one time chance for back log papers 2025 exam. డిగ్రీ కోర్సుల్లో బ్యాక్ లాగ్ లు ఉన్న విద్యార్థులకు తమ కోర్సులు పూర్తిచేసుకుని, సర్టిఫికెట్లు పొందటానికి వన్ టైం ఛాన్స్ కింద ప్రత్యేక సప్లిమెంటరీ పరీక్షలు రాసే అవకాశాన్ని ఉస్మానియా యూనివర్సిటీ తాజాగా కల్పించింది.
Osmania University one time chance for back log papers 2025 exam
2016 – 17, 2017 – 18, 2018 – 19, 2019- 20 విద్యా సంవత్సరంలో డిగ్రీ పరీక్షలు రాసి బ్యాక్‌లాగ్ లు ఉన్న విద్యార్థులు ఈ ప్రత్యేక సప్లిమెంటరీ పరీక్షలు రాయడానికి అర్హులు.
ఈ ప్రత్యేక సప్లిమెంటరీ పరీక్షలను వన్ టైం ఛాన్స్ కింద విద్యార్థులకు కల్పించారు. ఈ పరీక్షలు జూన్, జూలై 2025లో నిర్వహించే అవకాశం ఉందని ఉస్మానియా యూనివర్సిటీ ప్రకటించింది.
సెమిస్టర్ 1 నుండి 6 వరకు ఏ బ్యాక్లాగ్ ఉన్న ఈ ప్రత్యేక సప్లిమెంటరీ పరీక్షల్లో దరఖాస్తు చేసుకోవడం ద్వారా పరీక్షలు రాయవచ్చు.
దరఖాస్తు ఫీజు ను ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా మే 19 వరకు చెల్లించవచ్చు.
500/- రూపాయల ఆలస్య రుసుముతో మే 22 నుండి 29 వరకు దరఖాస్తు ఫీజు చెల్లించే అవకాశాన్ని కూడా కల్పించారు.
ఈ వన్ టైం ఛాన్స్ BSc, BCom, BA, BBA, BSW కోర్సుల్లో బ్యాక్‌లాగ్ ఉన్న అభ్యర్థులు ఉపయోగించుకోవచ్చు.
పరీక్ష ఫీజుతోపాటు ప్రతి పేపర్ కు 2000/- రూపాయలను చెల్లించాల్సి ఉంటుంది.
పరీక్ష ఫీజును సంబంధించిన కళాశాలలో చెల్లించాల్సి ఉంటుంది
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్