OSCAR 2023 : షార్ట్ లిస్ట్‌లో 4 భారతీయ నామినేషన్‌లు

లాస్‌ఎంజెల్స్ (డిసెంబర్ – 22) : Oscar Awards 2023 డిసెంబర్ 22న షార్ట్ లిస్ట్ చేసిన నామినేషన్ల జాబితాను విడుదల చేసింది. వాటిలో భారత్ నుండి నాలుగు నామినేషన్లు షార్ట్ లిస్ట్ స్థానం సంపాదించాయి. 95వ అకాడమీ అవార్డులను జనవరి 2023న ప్రకటించనున్నారు.

భారతదేశం నుండి అధికార ఎంట్రీగా పంపించబడ్డ గుజరాతి సినిమా “ఛల్లో షో” (chhello show) షార్ట్ లిస్టులో చోటు సంపాదించుకుంది. ఈ చిత్రం ‘ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిలిం’ కేటగిరీలో ఎంపిక చేయబడింది.

అలాగే ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన RRR సినిమాలోని “నాటు నాటు” (Natu natu song) సాంగ్ ఒరిజినల్ సౌండ్ విభాగంలో షార్ట్ లిస్టులో చోటు సంపాదించుకుంది.

అలాగే డాక్యుమెంటరీ ఫీచర్ ఫిలిమ్స్ విభాగంలో భారత్ నుండి రెండు చిత్రాలు షార్ట్ లిస్టులో చోటు సంపాదించుకున్నాయి… అవి

1) ALL THAT BREARHES,

2) THE ELEPHANTS WISHPER

FOLLOW US @TELEGRAM CHANNEL

తాజా వార్తలు