60 రోజుల వరకు ఉద్యోగ నోటిఫికేషన్ లకు బ్రేక్

BIKKI NEWS (OCT. 09) : one man committee on sc reservations in telangana. తెలంగాణ రాష్ట్రంలో 60 రోజుల వరకు ఎలాంటి ఉద్యోగ నోటిఫికేషన్లు నిలబడే అవకాశం లేదు. దీనికి కారణం తాజాగా ఎస్సీ వర్గీకరణ పై రాష్ట్ర ప్రభుత్వం ఏకాసభ్య కమిషన్ ను నియమించి రిపోర్ట్ ఇవ్వడానికి 60 రోజుల గడువు విధించింది. ఈ 60 రోజులలో ఎలాంటి ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేయబోమని (no job notifications in telangana up to 60 days.) సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.

one man committee on sc reservations in telangana.

2011 జనాభా లెక్కల ఆధారంగా ఏకసభ్య కమిషన్ తన నివేదికను రూపొందించాలని సీఎం తెలిపారు. ఏకసభ్య కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఎస్సీ వర్గీకరణ పై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. తదనంతరమే ఉద్యోగ నోటిఫికేషన్ లను జారీ చేయనున్నారు.

సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణపై తీర్పు వెలువరించిన నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ క్యాబినెట్ సబ్ కమిటీ పలుమార్లు సమావేశమై ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి సూచించింది.