NVS JOBS – 500 కాంట్రాక్టు టీచింగ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్

BIKKI NEWS (APRIL 23) : నవోదయ విద్యాలయ సమితి, భోపాల్ ప్రాంతీయ కార్యాలయం కాంట్రాక్టు ప్రాతిపదికన మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాల్లో ఉన్న జవహర్ నవోదయ విద్యాలయాల్లో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి 500 టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ (NVS CONTRACT TEACHER JOB NOTIFICATION 2024) జారీ చేసింది.

ఖాళీల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య: 500. (TGT & PGT)

1) ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (TGT): 283 పోస్టులు

సబ్జెక్టులు: హిందీ, ఇంగ్లిష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ సైన్స్, ఒరియా, కంప్యూటర్ సైన్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్, మ్యూజిక్, ఆర్ట్, ఒకేషనల్, లైబ్రేరియన్.

అర్హతలు : సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ, బీఈడీ, సీటెట్ ఉత్తీర్ణతతో పాటు బోధన అనుభవం ఉండాలి.

2) పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (PGT ): 217 పోస్టులు

సబ్జెక్టులు: హిందీ, ఇంగ్లిష్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, కంప్యూటర్ సైన్స్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకనామిక్స్, కామర్స్.

అర్హతలు : సంబంధిత సబ్జెక్టులో పీజీ, బీఈడీ ఉత్తీర్ణతతో పాటు బోధన అనుభవం ఉండాలి.

వేతనం:

పీజీటీలకు ₹ 42,250/-
టీజీటీలకు ₹ 40,625/-

వయో పరిమితి: 01-07-2024 నాటికి 50 ఏళ్లు మించకూడదు.

ఎంపిక విధానం : విద్యార్హతలు, అచీవ్ మెంట్స్/ అవార్డులు, పని అనుభవం, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా

దరఖాస్తు గడువు : 26/04/2024.

ఇంటర్వ్యూ తేదీలు: 16-05-2024 నుంచి.

పూర్తి నోటిఫికేషన్ : PDF

వెబ్సైట్ : KVS WEBSITE