GSLV F12 – NVS 01 ప్రయోగం విజయవంతం

శ్రీహరికోట (మే – 29) : నావిగేషన్ విత్ ఇండియన్ కాన్‌స్టెలేషన్ (NavIC) సేవల కోసం ఉద్దేశించబడిన రెండవ తరం ఉపగ్రహాలలో మొదటిది అయినా NVS-01 ఉపగ్రహ ప్రయోగాన్ని ఇస్రో విజయవంతం చేసింది. GSLV F12 రాకెట్ ద్వారా ఈ ప్రయోగాన్ని భూపరివేష్టిత కక్షలో విజయవంతంగా ప్రవేశపెట్టారు. 12 సంవత్సరాల పాటు ఇది తన సేవలను అందించనుంది

NVS శ్రేణి ఉపగ్రహాలు మెరుగుపరచబడిన లక్షణాలతో NavICని సేవలను విస్తృత పరచడానికి ఉపయోగపడుతాయి. ఈ సిరీస్ సేవలను విస్తృతం చేయడానికి అదనంగా L1 బ్యాండ్ సిగ్నల్‌లను కలిగి ఉంటుంది. మొట్టమొదటిసారిగా, NVS-01లో స్వదేశీ అణు గడియారం సేవలను అందిస్తుంది.