BIKKI NEWS (DEC. 18) : NTA conducts only entrance tests. వచ్చే సంవత్సరం ఎన్‌టీఏను సమూలంగా ప్రక్షాళన చేస్తామని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పార్లమెంట్ లో ప్రకటించారు. ఎన్‌టీఏ ఇకపై ఎలాంటి రిక్రూట్‌మెంట్ పరీక్షలను నిర్వహించదని, కేవలం ప్రవేశ పరీక్షలకే పరిమితమవుతుందని స్పష్టం చేశారు.
NTA conducts only entrance tests
నీట్, యూజీసీ-నెట్‌లలో ప్రశ్నపత్రాల లీకేజీ అనుమానాలు వచ్చిన విషయాన్ని ఆయన ప్రస్తావిస్తూ.. ఇకపై పకడ్బందీగా పరీక్షలు జరుగుతాయని స్పష్టం చేశారు.
పేపర్-పెన్/ఓఎంఆర్ కాకుండా.. ప్రవేశ పరీక్షలన్నీ సీబీటీ విధానంలో జరుగుతాయన్నారు. నీట్ విషయంలో ఓఎంఆర్ విధానమా? సీబీటీనా? అనే అంశంపై కేంద్ర ఆరోగ్య శాఖతో సంప్రదింపులు జరుపుతున్నామన్నారు.
సీయూఈటీ-యూజీని ఏడాదికి ఒకసారే నిర్వహిస్తారని చెప్పారు. పలు సంస్థల (స్వయం పోర్టల్ వంటి కోర్సులు) కోసం ఎన్‌టీఏ పరీక్షలు నిర్వహించడం వల్ల ఆ సంస్థపై ఎక్కువ భారం పడుతోందన్నారు.
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్