Home > UNCATEGORY > జీజేసీ గర్ల్స్ హుస్నాబాద్‌లో ఘనంగా జాతీయ సేవా పథకం ఆవిర్భావ దినోత్సవం

జీజేసీ గర్ల్స్ హుస్నాబాద్‌లో ఘనంగా జాతీయ సేవా పథకం ఆవిర్భావ దినోత్సవం

BIKKI NEWS (SEP. 24) : NSS DAY CELEBRATIONS IN GJC GIRLS HUSNABAD. ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల హుస్నాబాద్ లో జాతీయ సేవా పథకం ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో జాతీయ సేవా పథకం ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ మరియు ఎన్ఎస్ఎస్ చైర్మన్ శ్రీమతి కందుల శోభా దేవి అధ్యక్షత వహించడం జరిగింది.

NSS DAY CELEBRATIONS IN GJC GIRLS HUSNABAD

విద్యార్థినిలు మరియు ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు ఎన్ఎస్ఎస్ అక్షరాల రూపంలో కూర్చొని చుట్టూ మానవహారంగా ఏర్పడడం జరిగింది. అనంతరం కళాశాల ప్రిన్సిపాల్ మరియు అధ్యాపక అధ్యాపకేతర బృందము మరియు విద్యార్థులు మరియు ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు అందరూ కలిసి ఎన్ఎస్ఎస్ ప్రతిజ్ఞ చేయడం జరిగింది.

అనంతరము కళాశాల ప్రిన్సిపాల్ మరియు ఎన్ఎస్ఎస్ చైర్మన్ శ్రీమతి కందుల శోభా దేవి మాట్లాడుతూ… ఎన్ఎస్ఎస్ యొక్క ఆవశ్యకతను వివరిస్తూ విద్యార్థినిలు తరగతి గదిలో నేర్చుకున్న విజ్ఞానాన్ని సామాజిక కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలని సూచిస్తూ విద్యార్థులు మరియు ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు స్వచ్ఛభారత్ సాంఘిక అవగాహన ర్యాలీలు ప్రత్యేక ఎన్ఎస్ఎస్ శిబిరాలలో చురుకుగా పాల్గొనాలని ట్రాఫిక్ ను నియంత్రించాలని తెలుపుతూ ప్రకృతి వైపరీత్యాలను వచ్చే విపత్తులలో సహాయం అందించాలని తెలిపారు. ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు రాష్ట్ర మరియు జాతీయస్థాయిలో మంచి గుర్తింపును పొందాలని ఆకాంక్షించారు.

అనంతరం ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ శ్రీ డి కరుణాకర్ మాట్లాడుతూ… ఎన్ఎస్ఎస్ యొక్క ఆవిర్భావము మరియు ఎన్ఎస్ఎస్ యొక్క లక్ష్యాలను గురించి వివరిస్తూ ఎన్ఎస్ఎస్ వాలాంటి యొక్క విధులను సూచించి వాలంటీర్లు సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని తెలిపారు.

అనంతరము కళాశాల ప్రాంగణంలో కళాశాల ప్రిన్సిపల్ మరియు అనంతరం కళాశాల ప్రాంగణంలో కళాశాల ప్రిన్సిపల్ మరియు ఎన్ఎస్ఐ చైర్మన్ శ్రీమతి కందుల శోభా దేవి మరియు అధ్యాపక అధ్యాపక ఇతర బృందము మరియు ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు అందరూ కలిసి మొక్కలను నాటడం జరిగింది. ఈ కార్యక్రమము ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ శ్రీ డి కరుణాకర్ యొక్క పర్యవేక్షణలో జరిగింది.

ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపక బృందం శ్రీ డి రవీందర్, శ్రీ యస్. సదానందం, శ్రీ బి లక్ష్మయ్య, శ్రీమతి టి నిర్మలాదేవి, శ్రీ ఏ సంపత్, శ్రీమతి ఎస్ కవిత, శ్రీమతి జి కవిత, శ్రీమతి జి కవిత, శ్రీ పి రాజేంద్రప్రసాద్, అధ్యాపకేతర బృందం జూనియర్ అసిస్టెంట్ రాములు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు మరియు విద్యార్థినిలు మొదలగు వారు పాల్గొన్నారు.

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు