జీజేసీ బాలుర హుస్నాబాద్ లో ఘనంగా NSS ఆవిర్భావ దినోత్సన వేడుకలు

BIKKI NEWS (SEP. 24) : NSS DAY CELEBRATIONS IN GJC BOYS HUSNABAD. హుస్నాబాద్ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో మంగళవారం ప్రిన్సిపాల్ సీహెచ్ గంగాధర్ అద్వర్యంలో ఘనంగా 55 వ NSS ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిగాయి. కార్యక్రమానికి ముందుగా విద్యార్థులచే మానవ హారం ఏర్పాటు చేసి NSS ప్రాముఖ్యతను వివరించారు.

NSS DAY CELEBRATIONS IN GJC BOYS HUSNABAD

ఆనంతరం NSS చైర్మన్ మరియు ప్రిన్సిపాల్, కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ “విదార్థుల్లో సేవాభావం పెంపొందించు కోవాలని కోరారు. NSS ద్వారా విద్యార్థుల్లో విలువలు మరియు క్రమశిక్షణ పెంపొందించడానికి దోహదపడుతుందని అన్నారు. విద్యార్థుల హాజరు శాతం మరింత మెరుగు పడాలని ఆయన కోరారు. కళాశాలలో విద్యార్థుల కోసం అన్ని సౌకర్యాలు మెరుగు పరచడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు.”

NSS ప్రోగ్రాం అధికారి టీ. రణధీర్ కుమార్ మాట్లాడుతూ “విద్యార్థులు చదువుతోపాటు సంఘసేవ అలవర్చుకోవాలని సూచించారు”.

ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, విద్యార్థులు పాల్గొన్నారు .

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు