BIKKI NEWS (JUNE 26) :NS ICAR FELLOWSHIP 2025. నేతాజీ సుభాష్ – ICAR ఇంటర్నేషనల్ ఫెలోషిప్స్ (NS-ICARIFs) కోసం అగ్రికల్చర్ మరియు అనుబంధ సైన్సెస్ లో మాస్టర్స్ డిగ్రీ కలిగిన భారతీయులు అదేవిధంగా విదేశీయుల నుండి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ICAR) దరఖాస్తులు కోరుతోంది.
NS ICAR FELLOWSHIP 2025.
ఉన్నత పరిశోధన మరియు బోధనా సామర్థ్యాలు కలిగి ఉండి ICAR-AUs విధానంలో (i) గుర్తించబడిన విదేశీ యూనివర్సిటీలు /ఇన్స్టిట్యూషన్స్ లో విదేశాలలో అధ్యయనానికి భారతీయ అభ్యర్థులకు మరియు (ii) ఇండియన్ అగ్రికల్చరల్ యూనివర్సిటీలు (AUs)లో అధ్యయనానికి విదేశీ అభ్యర్థులకు గుర్తించిన ప్రాధాన్యతా ఏరియాలలో అగ్రికల్చర్ మరియు అనుబంధ సైన్సెన్ లో డాక్టోరల్ డిగ్రీ చదివేందుకు NS-ICARIFs అందుబాటులో ఉన్నాయి.
మూడు సంవత్సరాల కాలవ్యవధి కోసం ముప్పై(30) ఫెలోషిప్లు ఉన్నాయి.
సవివరమైన మార్గదర్శకాలు, అధ్యయన ప్రాధాన్యతా ఏరియాలు మరియు దరఖాస్తు ప్రొఫార్మా ICAR వెబ్సైట్ లో www.icar.org.in లో లభిస్తాయి.
దరఖాస్తును ఇమెయిల్ కు “Application for NSIF: Name of Applicant and Contact Number” ని తెలుపుతూ adg.hrd.applications@gmail.com కు 31 జూలై 2025 లోగా దాఖలు చేయాలి.దరఖాస్తు దాఖలుకు చివరి తేది 31 జూలై 2025.
- Engineering Counselling – బీటెక్ ఫీజుల విషయంలో తగ్గని ప్రభుత్వం
- Fellowship – ICAR ఇంటర్నేషనల్ ఫెలోషిప్
- Shubhnsh shukla – అంతరిక్ష కేంద్రంలోకి పయనమైన శుభాన్షు శుక్లా
- ISS : అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం విశేషాలు
- PAKISTAN – అణు బాలిస్టిక్ క్షిపణి తయారీలో పాకిస్థాన్