JOBS : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లో ఉద్యోగాలు

హైదరాబాద్ (సెప్టెంబర్ 11) : యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ (UoH Recruitment 2023) డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా 95 నాన్ టీచింగ్ ఉద్యోగాలను ప్రత్యక్ష పద్దతిలో నియామకానికి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ జారీ చేసింది.

ఖాళీల వివరాలు

డిప్యూటీ రిజిస్ట్రార్(డిప్యుటేషన్)-1
అసిస్టెంట్ లైబ్రేరియన్- 4
అసిస్టెంట్ రిజిస్ట్రార్ – 2
సెక్షన్ ఆఫీసర్- 2
అసిస్టెంట్ ఇంజినీర్ (సివిల్/ఎలక్ట్రికల్)- 02
సెక్యూరిటీ ఆఫీసర్- 2
సీనియర్ అసిస్టెంట్- 2
ప్రొఫెషనల్ అసిస్టెంట్-1
జూనియర్ ఇంజినీర్ (సివిల్/ ఎలక్ట్రికల్) – 8
అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్- 1
జూనియర్ ప్రొఫెషనల్ అసిస్టెంట్- 2
స్టాటిస్టికల్ అసిస్టెంట్- 01
ఆఫీస్ అసిస్టెంట్ – 10
లైబ్రరీ అసిస్టెంట్- 4
జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్- 44
హిందీ టైపిస్ట్- 10
ల్యాబొరేటరీ అటెండెంట్- 8

అర్హతలు : సంబంధిత విభాగంలో ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, ఎంఫిల్, పీహెచ్డీ, నెట్/ స్లెట్/ సెట్ తో పాటు పని అనుభవం ఉండాలి.

ఎంపిక విధానం : రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్/ ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు పంపవలసిన చిరునామా: అసిస్టెంట్ రిజిస్ట్రార్, రిక్రూట్మెంట్ సెల్, రూమ్ నెం: 221, ఫస్ట్ ఫ్లోర్, అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, ప్రొఫెసర్. సి.ఆర్. రావు రోడ్, సెంట్రల్ యూనివర్సిటీ,
గచ్చిబౌలి, హైదరాబాద్.

దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా

దరఖాస్తుకు చివరి తేదీ: సెప్టెంబర్ 30 – 2023.

దరఖాస్తు హార్డ్ కాపీ స్వీకరణకు చివరి తేదీ: 06-10-2023.

వెబ్సైట్: https://uohyd.ac.in/