NOBEL PEACE PRIZE 2024 -నిహ‌న్ హిడంక్యో సంస్థ‌కు నోబెల్ శాంతి బహుమతి

BIKKI NEWS (OCT. 11) : The Norwegian Nobel Committee has decided to award the 2024 Nobel Peace Prize to the Japanese organisation Nihon Hidankyo. This grassroots movement of atomic bomb survivors from Hiroshima and Nagasaki, also known as Hibakusha, is receiving the peace prize for its efforts to achieve a world free of nuclear weapons and for demonstrating through witness testimony that nuclear weapons must never be used again. జ‌పాన్‌కు చెందిన నిహ‌న్ హిడంక్యో సంస్థ‌కు నోబెల్ శాంతి బహుమతి 2024 ను ప్రకటించారు. హిరోషిమా, నాగ‌సాకిపై జ‌రిగిన అణుబాంబు దాడిలో దెబ్బ‌తిన్న బాధితుల కోసం నిహ‌న్ హిడంక్యో సంస్థ ప‌నిచేస్తున్న‌ది.

Nobel Peace Prize 2024 to Nihon Hidankyo

నిహ‌న్ హిడంక్యోకు హిబకుషా అనే మ‌రో పేరు ఉన్న‌ది. అణ్వాయుధ ర‌హిత ప్ర‌పంచాన్ని ఆ సంస్థ కోరుకుంటున్న‌ట్లు నార్వేయ‌న్ నోబెల్ క‌మిటీ త‌న ప్ర‌క‌ట‌న‌లో వెల్ల‌డించింది. న్యూక్లియ‌ర్ ఆయుధాల‌ను మ‌ళ్లీ వాడ‌రాదు అని ఆ సంస్థ ప్ర‌త్య‌క్ష బాధితుల‌తో ప్ర‌ద‌ర్శ‌న‌లు ఇచ్చిన‌ట్లు క‌మిటీ పేర్కొన్న‌ది.

త‌మ అవార్డుతో హిరోషిమా, నాగ‌సాకి అణుబాంబు బాధితుల‌ను గౌర‌విస్తున్న‌ట్లు నార్వేయ‌న్ నోబెల్ క‌మిటీ త‌న ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది.

భౌతిక‌ప‌ర‌మైన స‌మ‌స్య‌లు, జ్ఞాప‌కాలు వేధిస్తున్నా.. జ‌పాన్ సంస్థ త‌మ అనుభ‌వంతో ప్ర‌జ‌ల్లో ఆశ‌, శాంతిని పెంపొదిస్తున్న‌ట్లు క‌మిటీ వెల్ల‌డించింది. అణు ఆయుధాల వ‌ల్ల క‌లిగే న‌ష్టాన్ని ఆ సంస్థ వివ‌రించ‌గ‌లుతోంద‌ని క‌మిటీ చెప్పింది.

నోబెల్ శాంతి బ‌హుమ‌తిని 1901 నుంచి ఇస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు 104 సార్లు ఆ పుర‌స్కారాన్ని అందించారు. వ్య‌క్తుల‌తో పాటు సంస్థ‌ల‌కు కూడా నోబెల్ శాంతి పుర‌స్కారాన్ని ప్ర‌క‌టించారు.

గ‌త ఏడాది మ‌హిళల హ‌క్కులు, ప్ర‌జాస్వామ్యం గురించి పోరాడిన ఇరాన్ సామాజిక కార్య‌కర్త న‌ర్గెస్ మొహ‌మ్మ‌దీకి అవార్డును ఇచ్చారు.

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు