NOBEL PEACE 2021 – జర్నలిస్టులకు శాంతి నోబెల్‌

  • మరియా రెసా‌, దిమిత్రి మురటోవ్ లకు శాంతి నోబెల్

BIKKI NEWS : ప్రతిష్ఠాత్మక నోబెల్‌ శాంతి పురస్కారం 2021 (NOBEL PEACE 2021) గానూ ప్రజాస్వామ్యానికి మూలమైన భావ ప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణ కోసం చేసిన కృషికి చేసిన ఫిలిప్పీన్స్‌, రష్యా జర్నలిస్టులు మరియా రెసా(మహిళ), దిమిత్రి మురాటోవ్‌లకు దక్కింది.

ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యం, మీడియా స్వేచ్ఛ తీవ్ర ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో భావ ప్రకటనా స్వేచ్చ కోసం వీరు ధైర్యంగా పోరాడుతున్నారని కమిటీ ఈ సందర్భంగా ప్రశంసించింది.

★ మరియా రెసా :: (రాప్లర్ పత్రిక)


తమ దేశం ఫిలిప్పీన్స్‌ లో పెరుగుతున్న అధికార దుర్వినియోగం, హింసను తన కలంతో ప్రపంచానికి తెలియజేశారు. ఇన్వెస్టిగేటివ్‌ జర్నలిజం కోసం 2012లో ఆమె ‘రాప్లర్‌’ పేరుతో ఓ డిజిటల్‌ మీడియా కంపెనీని స్థాపించారు. ఓ జర్నలిస్టుగా, రాప్లర్‌ సీఈవోగా రెసా.. ఎన్నో సంచలనాత్మక కథనాలను ధైర్యంగా ప్రచురించారు. అన్ని వేపులా నుండి ఒత్తిళ్లు ఎదుర్కొంటూనే.. భావ ప్రకటనా స్వేచ్ఛ కోసం పోరాడుతూనే ఉన్నారు.

★ దిమిత్రి ముర‌టోవ్‌ :: (నోవాజా గెజిటా పత్రిక)

ర‌ష్యాలో కొన్ని ద‌శాబ్ధాలుగా భావ స్వేచ్ఛ కోసం ముర‌టోవ్ పోరాటం చేశారు. రోజురోజుకూ స‌వాల్‌గా మారుతున్న ప‌రిస్థితుల్లో ఆయ‌న మేటి జ‌ర్న‌లిస్టు పాత్ర‌ను పోషించారు. 1993లో నోవాజా గెజిటా అనే ప‌త్రిక‌ను స్థాపించారు. స‌త్యాన్ని రాయ‌డం, ప్రొఫెష‌న‌ల్‌గా వార్త‌ల‌ను అందించ‌డంలో నోవాజా గెజిటాకు మంచి గుర్తింపు వ‌చ్చింది. ర‌ష్యాలో మ‌రే మీడియా చేయ‌లేని ప‌ని ముర‌టోవ్ చేశారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఆ ప‌త్రిక‌కు చెందిన ఆరుగురు జ‌ర్న‌లిస్టులు హ‌త్య‌కు గుర‌య్యారు. ఎన్ని బెదిరింపులు వ‌చ్చినా.. ఎడిట‌ర్ దిమిత్రి ప‌త్రిక‌ను ధైర్యంగా న‌డిపారు. జ‌ర్న‌లిస్టుల హ‌క్కుల కోసం నిరంత‌రం శ్ర‌మించారు.