NOBEL PRIZE 2021 IN LITERATURE

BIKKI NEWS : నోబెల్ సాహిత్య అవార్డు 2021ను గ‌ల్ఫ్ న‌వ‌లా ర‌చ‌యిత అబ్దుల్ ర‌జాక్ గుర్నా (NOBEL PRIZE 2021 IN LITERATURE) గెలుచుకున్నారు. బ్రిటీష్ పాల‌కుల వ‌ల్ల క‌లిగిన వ‌ల‌స‌వాదం ప్ర‌భావాల‌ను, గ‌ల్ఫ్‌లో విభిన్న సంస్కృతుల మ‌ధ్య న‌లిగిన శ‌ర‌ణార్థుల దీనావ‌స్థ‌ల‌ను అబ్దుల్ ర‌జాక్ త‌న ర‌చ‌నా శైలిలో సుస్ప‌ష్టంగా వ్య‌క్తం చేసిన‌ట్లు ఇవాళ స్వీడిష్ అకాడ‌మీ త‌న ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది.

★ రచనలు ::

  • మెమొరీ ఆఫ్‌ డిపార్చర్‌(1987)
  • పిలిగ్రిమ్స్‌ వే(1988)
  • డాటీ(1990)
  • పారడైజ్‌(1994)
  • అడ్మైరింగ్‌ సైలెన్స్‌(1996)
  • బై ది సీ(2001)
  • డిజర్షన్‌(2005)
  • ది లాస్ట్‌ గిఫ్ట్‌(2011)
  • గ్రేవల్‌ హార్ట్‌(2017)
  • ఆఫ్టర్‌ లైవ్స్‌(2020)

★ అబ్దుల్ రజాక్ గుర్నా ::

1948లో అబ్దుల్ రజాక్ జ‌న్మించారు. జంజీబ‌ర్ దీవుల్లో ఆయ‌న పెరిగారు. 1960 ద‌శ‌కంలో ఓ శ‌ర‌ణార్థిగా ఆయ‌న ఇంగ్లండ్ చేరుకున్నారు. ఇటీవ‌లే ఆయ‌న రిటైర్ అయ్యారు. అబ్దుల్‌ర‌జాక్ మొత్తం ప‌ది న‌వ‌ల‌ను రాశారు. ఇంకా ఎన్నో చిన్న క‌థ‌ల‌ను ప‌బ్లిష్ చేశారు. ఓ శ‌ర‌ణార్థి ఎలా న‌లిగిపోయాడో త‌న ర‌చ‌నాశైలితో ఆక‌ట్టుకున్నారు. 21 ఏళ్ల నుంచి ఆయ‌న రైటింగ్ ప్రారంభించారు. ఆయ‌న తొలి భాష స్వాహిలి. కానీ త‌న సాహిత్య ప్ర‌క్రియ‌కు మాత్రం ఆయ‌న ఇంగ్లీష్‌ను ఎంచుకున్నారు.