BIKKI NEWS (OCT. 07) : NOBEL IN MEDICINE 2024 FOR DISCOVERY OF MICRO RNA. వైద్య రంగంలో నోబెల్ బహుమతి 2024 ను విక్టర్ ఆంబ్రోస్, గ్యారీ రువ్‌కున్‌లకు ప్రకటించారు. జీన్ రెగ్యులేషన్‌లో మైక్రో ఆర్ఎన్ఏ పాత్రను విశ్లేషించినందుకు ఆ ఇద్దరికి అవార్డును ప్రకటిస్తున్నట్లు నోబెల్ కమిటీ వెల్లడించింది. మైక్రో ఆర్ఎన్ఏను ఈ ఇద్దరు శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు.
NOBEL IN MEDICINE 2024 FOR DISCOVERY OF MICRO RNA
బహుకణ జీవుల్లో గడిచిన 500 మిలియన్ల ఏళ్లలో మైక్రో ఆర్ఎన్ఏ ఎంతో రూపాంతంరం చెందినదని శాస్త్రవేత్తలు నిరూపించారు. మనుషుల్లో ఉండే మైక్రో ఆర్ఎన్ఏల్లో.. వేల సంఖ్యలో జన్యువులు ఉన్నాయని, అయితే జన్యువులను మైక్రో ఆర్ఎన్ఏ రెగ్యులేట్ చేస్తున్నదని పేర్కొన్న శాస్త్రవేత్తలకు ఈ అవార్డును ప్రకటించారు.
మనుషుల్లో ఉండే మైక్రో ఆర్ఎన్ఏ.. బహుకణ జీవుల్లోని ఆర్ఎన్ఏ ఒకే విధంగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. జన్యు నియంత్రణ గురించి ఎన్నో దశాబ్ధాలుగా స్టడీ జరుగుతోంది. ఒకవేళ జన్యు నియంత్రణ గతి తప్పితే, అప్పుడు తీవ్రమైన క్యాన్సర్, డయాబెటిస్ లాంటి వ్యాధులు సోకే ప్రమాదం ఉందని నోబుల్ కమిటీ తన ప్రకటనలో తెలిపింది.
విక్టర్ ఆంబ్రోస్, గ్యారీ రువ్‌కున్‌లు 1ఎంఎం పొడువైన వానపాము సీ. ఎలిగాన్స్ జీవిని స్టడీ చేశారు. చాలా చిన్న సైజులో ఉండే ఆ జీవిలో.. ఎన్నో రకాల ప్రత్యేకమైన కణాలు ఉన్నాయి. ఆ రౌండ్ వామ్‌లో నరాల, కణజాల కణాలు ఉన్నట్లు గుర్తించారు. ఇదే తరహా కణాలు.. అతిపెద్ద, సంక్లిష్టమైన జంతువుల్లోనూ గుర్తించవచ్చు. కణజాలం ఎలా వృద్ధి చెందుతుందన్న అంశాన్ని మైక్రో ఆర్ఎన్ఏ ద్వారా స్టడీ చేశారు.
ఇప్పటి వరకు మెడిసిన్ ప్రైజ్‌ను 114 సార్లు మొత్తం 227 మందికి ఇచ్చారు. మెడిసిన్ కేటగిరీలో కేవలం 13 మంది మహిళలు మాత్రమే ఆ అవార్డు అందుకున్నారు. అవార్డు కింద 11 మిలియన్ల స్వీడిష్ క్రానర్ (మిలియన్ అమెరికా డాలర్లు) అందిస్తారు.