Home > 6 GUARANTEE SCHEMES > RYTHU BANDHU – పన్ను చెల్లింపుదారులకు రైతు బంధు కట్.!

RYTHU BANDHU – పన్ను చెల్లింపుదారులకు రైతు బంధు కట్.!

BIKKI NEWS (MARCH – 05) : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రైతుబంధు నిధులు పై కీలక వ్యాఖ్యలు చేశారు. పన్ను చెల్లింపుదారులకు రైతుబంధు (no rythu bandhu scheme for tax payers) అవసరమేంటని, వ్యవసాయం చేసే రైతులకు మాత్రమే రైతుబంధు అవసరం అని వ్యాఖ్యానించారు.

వ్యవసాయ పెట్టుబడి కోసమే రైతు బంధు పథకం యొక్క ముఖ్య ఉద్దేశ్యమని, వ్యవసాయం చేయని పన్ను చెల్లింపుదారులకు రైతుబంధు అవసరం ఏంటని మీడియాతో చిట్ చాట్ సందర్భంగా వ్యాఖ్యానించారు.

రైతుబంధు పథకం మార్గదర్శకాలపై త్వరలోనే అసెంబ్లీ సమావేశాలలో చర్చించి, తుది నిర్ణయం తీసుకుంటామని నూతన నిబంధనలు రూపొందిస్తామని పేర్కొన్నారు.