BIKKI NEWS (NOV. 06) : NO FEES FOR TET NOT QUALIFIED CANDIDATES. తెలంగాణ రాష్ట్ర టీచర్ ఎలిజిబులిటి టెస్ట్ 2024 రెండో దశ నోటిఫికేషన్ లో గత టెట్ లో అర్హత సాదించని అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.
NO FEES FOR TET NOT QUALIFIED CANDIDATES
గత టెట్ నోటిఫికేషన్ లో భారీగా ఫీజు పెంచడంతో అభ్యర్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో అప్పుడు ప్రభుత్వం అర్హత సాదించని అభ్యర్థులకు తరువాత టెట్ నోటిఫికేషన్ లో ఫీజు మినహాయింపు ఇస్తామని పేర్కొన్నారు. అలాగే దరఖాస్తు ఫీజు తగ్గించడానికి కూడా సుముఖత వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో ఈ టెట్ నోటిఫికేషన్ లో ఫీజు అంశంపై సీఎం రేవంత్ రెడ్డి నుంచి క్లియరెన్స్ రాకపోవడంతో 5వ తేదీన విడుదల కావాల్సిన నోటిఫికేషన్ 7వ తేదీకి వాయిదా పడినట్లు సమాచారం.
సీఎం రేవంత్ రెడ్డి నుంచి ఫీజు అంశంపై స్పష్టత రాగానే నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది.