NMMSS : నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ పరీక్ష హల్ టికెట్లు విడుదల

హైదరాబాద్ (డిసెంబర్ – 01) : తెలంగాణ రాష్ట్రంలో నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ స్కీమ్ 2023 (NMMSS EXAM TICKETS IN TELANGANA) రాత పరీక్ష హల్ టికెట్లు విడుదలయ్యాయి. కింద ఇవ్వబడిన లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు.

డిసెంబర్ 10వ తేదీన ఈ పరీక్షను ఉదయం 09.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహించనున్నట్లు బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ తెలియజేసింది.

ఆర్థికంగా వెనుకబడిన, ప్రతిభావంతులైన విద్యార్థులను ఆదుకొనేందుకు కేంద్ర ప్రభుత్వం NMMSS అమలు చేస్తోంది. 9వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకూ చదివే పేద విద్యార్థులను ప్రోత్సహించేందుకు ప్రతి సంవత్సరం ఉపకారవేతనాన్ని అందిస్తోంది.

TS. NMMSS EXAM HALL TICKETS