NIRF UNIVERSITY RANKINGS 2024 – యూనివర్సిటీ ర్యాకింగ్స్ 2024

BIKKI NEWS (AUG. 13) : NIRF UNIVERSITY RANKINGS 2024. నేషనల్‌ ఇనిస్టిట్యూషనల్‌ ర్యాంకింగ్‌ ఫ్రేమ్‌వర్క్‌’ 2024 ర్యాంకుల్లో ఐఐటీ-మద్రాస్‌ మరోమారు మొదటి స్థానంలో నిలిచింది. కేంద్ర విద్యాశాఖ పరిధిలోని ‘ఎన్‌ఐఆర్‌ఎఫ్‌’, దేశంలోని ఉన్నత విద్యా సంస్థల పనితీరు ఆధారంగా ఏటా వివిధ విభాగాల్లో టాప్‌-10 విద్యా సంస్థల పేర్లను విడుదల చేస్తున్నది. ఈ ఏడాది దేశవ్యాప్తంగా 10,885 విద్యా సంస్థల పనితీరును పరిశీలించి, 2024 ఏడాదికి ర్యాంకులను వెలువరించింది.

NIRF UNIVERSITY RANKINGS 2024

‘ఓవరాల్‌’, ‘ఇంజినీరింగ్‌’ రెండు విభాగాల్లోనూ వరుసగా ఆరోసారి ఐఐటీ-మద్రాస్‌ మొదటి ర్యాంక్‌ను కైవసం చేసుకుంది. ‘ఓవరాల్‌’ క్యాటగిరిలో బెంగళూరులోని ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌(ఐఐఎస్‌సీ) రెండో స్థానంలో నిలవగా, యూనివర్సిటీల విభాగంలో ఐఐఎస్‌సీ వరుసగా 9వ సారి టాప్‌ ప్లేస్‌లో నిలిచింది.

ఓవరాల్‌గా.. టాప్‌-5 కళాశాలలు

1.ఐఐటీ-మద్రాస్‌
2.ఐఐఎస్‌సీ-బెంగళూరు
3.ఐఐటీ-బాంబే
4.ఐఐటీ-ఢిల్లీ
5.ఐఐటీ-కాన్పూర్‌

టాప్‌-5- ఇంజినీరింగ్‌ కళాశాలు

1.ఐఐటీ-మద్రాస్‌
2.ఐఐటీ-ఢిల్లీ
3.ఐఐటీ-బాంబే
4.ఐఐటీ-కాన్పూర్‌
5.ఐఐటీ-ఖరగ్‌పూర్‌

టాప్‌-5- మేనేజ్‌మెంట్‌ కళాశాలలు

1.ఐఐఎం-అహ్మదాబాద్‌
2.ఐఐఎం-బెంగళూరు
3.ఐఐఎం-కోజికోడ్‌
4.ఐఐఎం-ఢిల్లీ
5.ఐఐఎం-కలకత్తా

టాప్‌-5-మెడికల్‌ కళాశాలలు

1.ఎయిమ్స్‌-ఢిల్లీ
2.పీజీఐఎంఈఆర్‌-చండీగఢ్‌
3.సీఎంసీ-వెల్లూర్‌
4.ఎన్‌ఐఎంహెచ్‌ఏఎన్‌ఎస్‌-బెంగళూరు
5.జేఐపీజీఎంఈఆర్‌ -పుదుచ్చేరి

ఉస్మానియా యూనివర్సిటీకి 70, జేఎన్టీయూహెచ్‌కు 88వ ర్యాంకులు దక్కాయి. ప్రభుత్వ యూనివర్సిటీల్లో ఓయూకు 6వ స్థానం.

కేవలం తెలంగాణకు చెందిన మూడు సంస్థలు మాత్రమే దేశంలో పలు విభాగాల్లో టాప్‌-10 జాబితాలో నిలిచాయి. ఇన్నోవేషన్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌లో ఐఐటీ హైదరాబాద్‌ 3వ ర్యాంకు. ఫార్మసీలో నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫార్మాస్యూటికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్‌(నైపర్‌) 2వ ర్యాంకు, న్యాయ విద్యాసంస్థల్లో నల్సార్‌ లా యూనివర్సిటీ 3వ ర్యాంకు సాధించాయి.

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు