కొత్తగా 20 KGBV పాఠశాలలు ఏర్పాటు

హైదరాబాద్ (ఆగస్టు – 29) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా 20 KGBV పాఠశాలలు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో విద్యాశాఖ జీవో నెంబర్‌-24ను విడుదల చేసింది. వీటిని ఏర్పాటుకు గాను రికరింగ్‌ బడ్జెట్‌గా రూ. 60 లక్షలను సైతం మంజూరు చేసింది.

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సమయంలో 2014లో రాష్ట్రంలో కేవలం 391 కేజీబీవీలు ఉండేవి. 2017-18లో కొత్తగా 84 కేజీబీవీలను మంజూరుచేశారు. దీంతో రాష్ట్రంలో కేజీబీవీల సంఖ్య 475కి చేరింది. తాజాగా మరో 20 కేజీబీవీలు మంజూరు చేయడంతో వీటి సంఖ్య 495కు చేరింది. వీటిల్లో 245 కేజీబీవీల్లో ఇంటర్‌, మరో 230 కేజీబీవీలను పదో తరగతి వరకు నిర్వహిస్తున్నారు

మావల (ఆదిలాబాద్‌), బీర్‌పూర్‌, బుగ్గారం (జగిత్యాల), కొత్తపల్లి, గన్నేరువరం (కరీంనగర్‌), దంతాలపల్లి (మహబూబాబాద్‌), మహ్మదాబాద్‌ (మహబూబ్‌నగర్‌), నార్సింగి, నిజాంపేట, హవేలి ఘన్‌పూర్‌ (మెదక్‌), నిజామాబాద్‌ (సౌత్‌), నిజామాబాద్‌ (నార్త్‌), నాగలిగిద్ద, మెగ్గుంపల్లి, వట్‌పల్లి, గుమ్మడిదల, చౌటకూరు (సంగారెడ్డి), దూల్మిట్ట (సిద్దిపేట), చౌడాపూర్‌ (వికారాబాద్‌).