BIKKI NEWS (SEP. 17) : New Ration Cards Guidelines 2024. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్ నుండి నూతన రేషన్ కార్డులు ఇవ్వడానికి చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో… సెప్టెంబర్ 21న రేషన్ కార్డుల జారీ పై ఏర్పడిన మంత్రి వర్గ ఉపసంఘం తన తుది సమావేశాన్ని నిర్వహించి తుది నిబంధనలు రూపొందించనుంది.
New Ration Cards Guidelines 2024
అనంతరం అక్టోబర్ నెల నుంచి రేషన్ కార్డుల కొరకు ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. అలాగే పార్టీలతో సంబంధం లేకుండా ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు నూతన రేషన్ కార్డుల మరియు హెల్త్ కార్డుల జారీపై తమ అభిప్రాయాన్ని సెప్టెంబర్ 19వ తేదీ లోపు చెప్పాలని సూచించారు.
ప్రస్తుతం రేషన్ కార్డుల జారీకి గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలలో వేరు వేరు అర్హతల ఆధారంగా జారీ చేస్తున్నారు.
గ్రామీణ ప్రాంతాలలో అయితే ఆదాయం సంవత్సరానికి లక్షన్నర, పట్టణ ప్రాంతాల్లో అయితే రెండు లక్షల లోపు ఉన్న వారికి రేషన్ కార్డులు జారీ చేస్తున్నారు.
అదే భూమి అయితే తరి భూమి అయితే మూడున్నర ఎకరాలు, మాగాని భూమి అయితే ఏడున్నర ఎకరాలు లోపు ఉన్నవారికి రేషన్ కార్డులు జారీ చేస్తున్నారు.
ఈ పరిమితులను తగ్గించాలా లేక పెంచాలా అనేది పలు పక్క రాష్ట్రాలతో పోల్చి త్వరలోనే ఉప సంఘం నిర్ణయం తీసుకోనుంది. అందుతున్న కీలక సమాచారం ప్రకారం ఇదే అర్హతలను ఉంచి నూతన రేషన్ కార్డులను జారీ చేయనున్నారు.
దాదాపు 15 లక్షల వరకు నూతన కార్డులను ప్రభుత్వం అందజేయాల్సి ఉంటుందని ప్రాథమిక సమాచారం. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డుదారుల సంఖ్య భారీగా పెరగనుంది.