Ration Cards – విధివిధానాలు పూర్తయ్యాక కొత్త రేషన్‌, ఆరోగ్య శ్రీ కార్డులు

BIKKI NEWS (JULY 25) : New Ration Cards And Arogya Sri cards in telangana. తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్‌ కార్డులు, ఆరోగ్య శ్రీ కార్డుల జారీకి ప్రభుత్వం విధివిధానాలు సిద్ధం చేస్తోందని, అనంతరం కొత్తవి జారీ చేస్తామని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు.

New Ration Cards And Arogya Sri cards in telangana

ప్రజావాణిలో ఇంతవరకు 1,944 మాత్రమే రేషన్‌కార్డుల కోసం దరఖాస్తులు వచ్చాయని వెల్లడించారు. ఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జారహ్మత్‌ బేగ్‌ అడిగిన ప్రశ్నకు ఈ మేరకు సమాధానం ఇచ్చారు.

‘‘గత ప్రభుత్వం కొత్త రేషన్‌ కార్డులు ఇవ్వలేదు. ఇంతవరకు రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ విధానాల మేరకు 54 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వ విధానాల మేరకు 35 లక్షలు కలిపి మొత్తం 89 లక్షల కుటుంబాలకు మాత్రమే రేషన్‌ కార్డులున్నాయి.

బీపీఎల్‌ పరిధిలోకి ఎవరు వస్తారు.. విధివిధానాలు ఎలా ఉండాలన్న విషయమై మంత్రి మండలిలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. అనంతరం ఆన్‌లైన్‌ పోర్టల్‌లో దరఖాస్తుకు అవకాశం కల్పిస్తాం. కొత్త కార్డులు మంజూరయ్యేంత వరకు ప్రస్తుతం ఉన్నవి యథావిధిగా కొనసాగుతాయి. బియ్యంతోపాటు ఇతర నిత్యావసరాలు అందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం’’ అని వివరించారు.

FOLLOW US @TELEGRAM CHANNEL

తాజా వార్తలు