Home > CURRENT AFFAIRS > APPOINTMENTS > ARMY CHIEF – నూతన సైన్యాధిపతి ఉపేంద్ర ద్వివేది

ARMY CHIEF – నూతన సైన్యాధిపతి ఉపేంద్ర ద్వివేది

BIKKI NEWS (JUNE 12) : భారత సైన్యానికి నూతన అధిపతిగా లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది ని (NEW INDIAN ARMY CHIEF UPENDRA DWIVEDI) కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు రక్షణ శాఖ ప్రకటన విడుదల చేసింది.

ఆయన ప్రస్తుతం వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ గా ఉన్నారు. జూన్ 30న ఉపేంద్ర ద్వివేది ఆర్మీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుత ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ సి. పాండే ఈ నెలాఖరులో పదవి విరమణ చేయనున్నారు. దీంతో నూతన ఆర్మీ చీఫ్ గా ఉపేంద్ర ద్వివేదిని నియమించారు.