NEW CURRICULUM FRAME WORK : బోర్డు పరీక్షలు ఇక రెండు సార్లు

న్యూఢిల్లీ (ఆగస్టు – 24) : కేంద్ర ప్రభుత్వం నూతన విద్యావిధానంలో(NEP) భాగంగా NEW CURRICULUM FRAME WORK (NCF) ను ప్రకటించింది. ఈ నూతన కరిక్యులం ప్రకారం అనేక కీలక మార్పులను విద్యావ్యవస్థలో చేపట్టనుంది. ఏ రాష్ట్రాలయితే ఈ నూతన కరిక్యులంకు ఒప్పుకుంటాయో మొదటగా ఆ రాష్ట్రాలలో అమలు చేయనుంది.

◆ NEW CURRICULUM FRAME WORK లోని అంశాలు

బోర్డు పరీక్షలను ఏడాదిలో రెండుమార్లు నిర్వహించాలి.

9, 10 తరగతులకు.. తప్పనిసరి లాంగ్వేజ్ సబ్జెక్టుల సంఖ్యను మూడుకు పెంచింది.

అలాగే ఇంటర్ విద్యార్థులు రెండు లాంగ్వేజ్ సబ్జెక్టులను తప్పనిసరిగా అభ్యసించాలి

2024 విద్యా సంవత్సరానికి పాఠ్యపుస్తకాలను అభివృద్ధి చేయనున్నారు.

11, 12 తరగతులలోని సబ్జెక్టుల ఎంపిక కేవలం ఆర్ట్స్, సైన్స్, కామర్స్ వంటి గ్రూపులకు మాత్రమే పరిమితం కారదు.

ఏడాదిలో రెండుమార్లు పరీక్షలు నిర్వహించటం ద్వారా విద్యార్థులపై ఒత్తిడి తగ్గడంతో పాటు వారి స్కోర్ ను మెరుగుపర్చుకునేందుకు అవకాశం లభిస్తుందని విద్యాశాఖ
పేర్కొన్నది.

ఆర్ట్స్, సైన్స్, వొకేషనల్, అకడమిక్ విభాగాల్లో కరికులమ్, ఎక్స్ ట్రా కరికులమ్ యాక్టివిటీస్ లో పెద్దగా తేడాలుండవు

అలాగే కనీస సబ్జెక్టుల సంఖ్య పెంచుతున్నట్టు ప్రకటించింది. 9, 10 తరగతుల్లో తప్పనిసరి సబ్జెక్టుల సంఖ్య ఏడుకు, ఇంటర్ లో ఆరుకు పెంచింది.