హైదరాబాద్ (మార్చి – 31) : NEST – 2025 NOTIFICATION. ఇంటర్మీడియట్ లో ఎంపీసీ, బైపీసీ విద్యార్థులకు ఉన్నత విద్యతో పాటు 60 వేల ఉపకార వేతనం అందించే నేషనల్ ఎంట్రన్స్ స్క్రీనింగ్ టెస్ట్ 2025 నోటిపికేషన్ వెలువడింది.
NEST – 2025 NOTIFICATION
ఇందులో రాణించినవాళ్లు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ (నైసర్), యూనివర్సిటీ ఆఫ్ ఆఫ్ ముంబయి, డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ విభాగానికి చెందిన సెంటర్ ఫర్ ఎక్స్టెన్స్ ఇన్ బేసిక్ సైన్సెస్ (సీఈబీఎస్)ల్లో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ కోర్సులు చదువుకోవచ్చు. అలాగే ఏడాదికి రూ.60,000 చొప్పున ఐదేళ్లపాటు ఉపకార వేతనం అందుకోవచ్చు. అలాగే వేసవిలో ఇంటర్న్షిప్ కోసం ఏడాదికి రూ.20,000 చొప్పున గ్రాంట్ ఇస్తారు. పరిశోధనల దిశగా ప్రోత్సాహం అందిస్తారు.
పరీక్ష వివరాలు : నేషనల్ ఎంట్రన్స్ స్క్రీనింగ్ టెస్ట్ 2025
అర్హతలు : సైన్స్ గ్రూప్స్ తో 2023, 2024లో ఇంటర్ ఉత్తీర్ణులు, ప్రస్తుతం ద్వితీయ సంవత్సరం కోర్సులు చదువుతున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. కనీసం 60 శాతం మార్కులు తప్పనిసరి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులైతే 55 శాతం ఉండాలి.
వయోపరిమితి : ఆగస్టు 01, 2005 తర్వాత జన్మించిన జనరల్, ఓబీసీలు అర్హులు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు గరిష్ఠ వయసులో ఐదేళ్లు సడలింపు వర్తిస్తుంది.
ఆన్లైన్ దరఖాస్తు గడువు : మే 31 వరకు
అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ ప్రారంభం : జూన్ 02 నుండి
పరీక్ష తేదీ : జూన్ – 22
దరఖాస్తు ఫీజు : జనరల్, ఓబీసీ పురుష అభ్యర్థులకు ?| 1400/-… అన్ని వర్గాల మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ₹ 700.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు : గుంటూరు, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విజయనగరం, హైదరాబాద్, కరీంనగర్, విశాఖపట్నం, వరంగల్.
వెబ్సైట్ : https://www.nestexam.in/
- After 10th – టెన్త్ తర్వాత కెరీర్ గైడెన్స్ పై విద్యాశాఖ కార్యక్రమం
- TODAY NEWS – సమగ్ర వార్తా సంకలనం – 03 – 04 – 2025
- GK BITS IN TELUGU 3rd APRIL
- చరిత్రలో ఈరోజు ఎప్రిల్ 03
- IPL 2025 RECORDS and STATS