NEHRU : ప్రజాస్వామ్య దార్శనికుడు నెహ్రూ – అస్నాల శ్రీనివాస్‌

  • నవంబర్ 14 నెహ్రూ జయంతి అస్నాల శ్రీనివాస్‌- టిజిఓ ఇంటర్ విద్య

BIKKI NEWS : స్వతంత్ర భారత ప్రథమ ప్రధానిగా మాత్రమే గాక స్వాతంత్ర పోరాటంలో సామాజిక రంగంలో అగ్రగామిగా పనిచేసినవారు జవహర్ లాల్ నెహ్రూ. స్వాతంత్రోద్యమ ప్రస్థానంలో కీలకమైన 1930, 1940 దశకాలంలో యువతను అకర్షించి భాగస్వామ్యం చేయించడం, విదేశాలలో స్వరాజ్య సమర గొంతుకనువినిపించడంలో, మద్ధతును కూడగట్టడంలో నెహ్రు ఆద్వితీయ కృషి చేసారు. స్వాతంత్య్రం తర్వాత 1947 నుండి 1964 వరకు దార్శనికత కల్గిన ప్రధానమంత్రిగా నవ్య, విశాల, వైవిద్య బహుళత్వ భారత నిర్మాణంలో, సంక్షేమ రాజ్య ప్రజాస్వామ్య మూర్తికి నిలయమైన రాజకీయాల కొనసాగింపుకు నమునాగాపనిచేసారు. విశాల భావాలు, అభ్యుదయ ధోరణి, చురుకైన నాయకత్వ లక్షణాలు, వైజ్ఞానిక మేథోపటిమతోఅస్థిరంగా అస్తవ్యస్థంగా, చిందరవందరంగా ఉన్న దేశాన్ని సంఘటితపరుస్తూ, సంస్థానాలను ఒక్కతాటిపైకితెచ్చి పునర్నిర్మాణానికి దీపస్తంభమై నిలిచాడు. ఒక శకం అంతానికి అంచున కొత్త చరిత్ర కాలపు గుమ్మంముందు ఉన్న భారత భవిష్యత్‌ను సమున్నతంగా తీర్చి దిద్దడానికి వ్యవసాయ, పారిశ్రామిక, శాస్త్ర సాంకేతికరంగాలలో స్వయం స్వాలంబన, స్వయం సమృద్ధి కోసం ప్రపంచస్థాయి ప్రయాణాలను అందుకోవడానికి బలమైన పునాదులను, సౌధాలను నిర్మించి చరిత్రలో చెరగని ముద్రవేసారు.

నెహ్రు అమరత్వం సందర్బంగా సుప్రసిద్ధ పత్రిక న్యూయార్క్‌ టైమ్స్‌ మేకర్‌ ఆఫ్‌ మాడ్రన్‌ ఇండియా గా అభివర్ణించింది. ది ఎకనామిస్ట్‌ పత్రిక సామాన్య ప్రజల ఆకాంక్షలను అకళింపు చేసుకున్న మహోన్నత వ్యక్తి అని, అతడు లేని అంతర్జాతీయ యవనిక పేదరాలిగా మారిందని వ్యాఖ్యానించింది. ఆధునిక భారత, ప్రపంచ రాజకీయాలలో ఉత్తేజకరమైన పాత్రను నిర్వర్తించిన ప్రభావశీలిగా సమాజం గుర్తించింది.

నెహ్రు అమరత్వం సందర్బంగా సుప్రసిద్ధ పత్రిక న్యూయార్క్‌ టైమ్స్‌ మేకర్‌ ఆఫ్‌ మాడ్రన్‌ ఇండియా గా అభివర్ణించింది. ది ఎకనామిస్ట్‌ పత్రిక సామాన్య ప్రజల ఆకాంక్షలను అకళింపు చేసుకున్న మహోన్నత వ్యక్తి అని, అతడు లేని అంతర్జాతీయ యవనిక పేదరాలిగా మారిందని వ్యాఖ్యానించింది. – అస్నాల శ్రీనివాస్

నవంబర్‌ 14, 1989 లో న్యాయవాది, రాజకీయ నాయకుడైన మోతీలాల్‌ నెహ్రు దంపతులకు జన్మించాడు. హౌరా, కేంబ్రిడ్జ్‌ విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్యను అభ్యసించాడు. హేతువు, కార్యకారణవాదం, వైజ్ఞానిక స్పృహ పట్ల మక్కువ పెంచుకొని జీవిత పర్యంతం కొనసాగించాడు. అదే సమయంలో మూడవ ప్రపంచ దేశాలను కబళింపజేస్తున్న సామ్రాజ్యవాద విస్తరణ విధానాలపై తీవ్ర వ్యతిరేఖతను పెంచుకొని పోరుబాట పట్టాడు. ఈ దృక్ఫథమే ఆ తర్వాత అలీనోద్యమ నిర్మాతగా మారడానికి దోహదపడింది. 1919-1920 కాలంలో జాతీయోద్యమ తీవ్రత కోసం అనుసరించాల్సిన వ్యుహాలపై, ఎత్తుగడలపై అతివాదులు, మితవాదుల మధ్య సంఘర్షణాత్మక వాతావరణ నెలకొని ఉన్నది. ఈ సందర్భములోని నెహ్రు రాజకీయాల్లోకి ప్రవేశించి గాంధీవైపు నిలిచాడు. హింసను,, నియంతృత్వాన్ని అసహ్యాంచుకొని, ప్రజాస్వామిక ప్రభుత్వ రూపాల పట్ట మమకారం ఉన్న గాంధీని అనుసరించాడు. బ్రిటిష్‌వారి శరణాగతిని పొంది కోవర్ట్‌లుగా మారి జాతీయోధ్యమానికి విద్రోహం తలపెడుతున్న ఆర్‌.ఎస్‌.ఎస్‌., హిందుమహాసభ, ముస్లిం లీగ్ సంస్థల కుట్రలను చేధించాడు.

1927 బ్రస్సెల్స్‌లో జరిగిన వలస పాలనతో మగ్గుతూ దోపిడికి గురవుతున్న దేశాల సమావేశంలో భారతప్రతినిధిగా పాల్గొన్నాడు. వనరులను మానవ శ్రమను కొల్లగొడుతూ మానవజీవనాన్ని విధ్వంసం చేస్తున్న సామ్రాజ్యవాదాన్ని ఉమ్మడిగా ఎదుర్కొవాలని ,తుద ముట్టించాలని పిలుపునిచ్చాడు. ఇదే ఉత్సహంతోఉత్పత్తి సాధనాలన్నీ ప్రభుత్వ ఆధీనంలో ఉండాలని ,ఆర్ధిక సమానత్వ ప్రాతిపదికగా భారత సమాజాన్ని మార్చి వేయాలనే లక్ష్యాలతో 1927 లో ఇండిపెండెంట్ లీగ్ సంస్థను నెలకొల్పారు .1928 లో భారత్‌కుఅధినివేశ ప్రతిపత్తి కల్గించాలని బ్రిటిష్‌ పాలకులకు ప్రతిపాదించగా విభేదించి సంపూర్ణ స్వరాజ్యమేఅంతిమ లక్ష్యంగా ఉండాలని సూచించాడు. 1929 లాహోర్‌ కాంగ్రెస్‌ సమావేశంలో ‘సంపూర్ణస్వరాజ్‌’తీర్మాణం చేయించాడు. ఉద్యమ తీవ్రతను పెంచడం కోసం శాసనోనల్లంఘన ఉద్యమానికియావత్తూ కాంగ్రెస్‌ శ్రేణులను సమాయత్తం చేసాడు. జనవరి 26, 1929 ని స్వాతంత్య్రదినంగా ప్రకటించిదేశప్రజలను ఉత్తేజపరిచాడు. 1947 స్వాతంత్ర ప్రకటనకు కొన్ని నెలల ముందు బాంబే, మద్రాస్‌, యు.పి. బెంగాల్‌ వంటి అనేక ప్రావిన్స్‌లను స్వతంత్ర రిపబ్లిక్‌లుగా వ్యవహరించే దేశాల సమాఖ్యగా ఏర్పాటుచేయాలని బ్రిటిష్‌ కెబినెట్‌ నిర్ణయం తీసుకుంది. ఎట్టి పరిస్థితులలో కాంగ్రెస్‌ పార్టీ ఈ ప్రతిపాదనల అమలుకు ఒప్పుకోదని ప్రకటించి ఆ నిర్ణయాన్ని ఉపసంహరించేలా చేసాడు. ఎప్పుడు తగవులాడుకునే విధంగా ఉండే చిన్న చిన్న దేశాల వంటి బాల్కనైజేషన్‌ అనే విపత్తు నుండి భారత్‌ను కాపాడినఅసమానధీరుడు. స్వదేశీ సంస్థానాలు పచ్చి నిరంకుశత్వానికి ప్రతీకలు , కనీస ప్రజాస్వామిక విలువలను గౌరవించరు అని చెపుతూ వాటిని భారత్ లొ విలీనం కావటానికి అత్యంత చొరవ చూపారు. నెహ్రూ నాయకత్వం వహంచిన ఘనమైన ఈ ప్రక్రియకు తన మంత్రి వల్లభాయ్ పటేల్ కు కట్టబట్టే ప్రచారానికి బిజెపి తెగబడుతున్నది .

1947 స్వాతంత్ర ప్రకటనకు కొన్ని నెలల ముందు బాంబే, మద్రాస్‌, యు.పి. బెంగాల్‌ వంటి అనేక ప్రావిన్స్‌లను స్వతంత్ర రిపబ్లిక్‌లుగా వ్యవహరించే దేశాల సమాఖ్యగా ఏర్పాటుచేయాలని బ్రిటిష్‌ కెబినెట్‌ నిర్ణయం తీసుకుంది. ఎట్టి పరిస్థితులలో కాంగ్రెస్‌ పార్టీ ఈ ప్రతిపాదనల అమలుకు ఒప్పుకోదని ప్రకటించి ఆ నిర్ణయాన్ని ఉపసంహరించేలా చేసాడు. – అస్నాల శ్రీనివాస్

ఉదమ్య ప్రస్థానంలో 1921-1945 కాలంలో 3,259 రోజులు అనగా 9 సంవత్సరాల జైలు జీవితాన్ని గడిపాడు. చరిత్ర నిర్మాణంలో పాల్గొనకుండా ఉన్న ఈ కాలంలో చరిత్రను రాజకీయ తత్వశాస్త్రము, సైన్స్‌, సాహిత్యములను అధ్యయనం చేశాడు. అధ్యయనం మెదడుకు వ్యాయామం లాంటిదని అదిలేకపోతే స్థబ్ధతకు లోనై కుళ్ళి పోతుందని చెప్పాడు. తన కాలంలో ఎదుర్కొన్న అనుభవాలు, పరిశీలనలను విస్తృత అధ్యయనంతో ప్రపంచ చరిత్రలో దిగ్దదర్శనాలు. ”ఆత్మకథ” భారత ఆవిష్కరణ గ్రంథాలను రచించాడు. నెషనల్ హెరాల్డ్ పత్రికను నడిపాడు .

గణతంత్ర, ప్రజాస్వామ్య రూపశిల్పిగా వ్యహారించి లక్ష్యాల తీర్మాణం వెలుగులో రాజ్యంగ నిర్మాణాన్ని నిర్దేశించాడు. ప్రతి పౌరుడికి అవకాశాల్లో సమానత, సామాజిక, ఆర్థిక రాజకీయ న్యాయం అందేలా భావ, సంఘ స్వాతంత్య్రాలను పొందే విధంగా రాజ్యాంగాన్ని రూపొందించేలా తన మేథో సహాచరుడు, సామాజిక విప్లవకారుడు అంబేద్కర్‌కు సంపూర్ణ తోడ్పాటును అందించాడు. బహుళ భాషా సంస్కృతులు, కుల, మత ప్రాంత పరంగా అనేక వైవిధ్యాలు ఉన్న బహుళత్వ భారత్‌లో ఐక్యత కాపాడుకునే ఉద్దేశ్యంతో కేంద్రానికి విశిష్ట అధికారాలు ఉండేలా నిబంధనలు రూపొందించాడు.

వర్ణ వివక్ష సామ్రాజ్యవాద విధానాల వ్యతిరేక పొరులో అంతర్జాతీయ గొంతుకగా మారాడు. నాగరికతలు విలిసిల్లిన ఆసియా, ఆఫిక్రా ఖండాలు పరస్పర సంఘీభావంతో, సహాకారంతో ప్రపంచ శాంతికి, అభివృద్ధికి కృషి, చేయాలని కోరాడు. ప్రపంచంపై ఆధిపత్యం కోసం ప్రచ్ఛన్న యుద్ధంకు పాల్పడుతున్న అమెరికా, రష్యాలకు సమాన దూరంలో ఉండాలని పిలుపునిచ్చాడు. శాంతియుత సహజీవనం, నిరాయుధీకరణల అలీనోద్యమానికి అంకురార్పణ చేసాడు. ప్రముఖ చరిత్రకారుడు జుడిత్‌ బ్రౌన్‌ రాసిన”నెహ్రు- ఏ పొలిటికల్‌ లైఫ్‌’ గ్రంథంలో ”నెహ్రు తన దేశానికి, విశిష్టమైన, స్వతంత్రమైన అంతర్జాతీయ గుర్తింపును తీసుకవచ్చాడు అని ప్రస్తావించాడు.

రష్యా విప్లవ ప్రేరణతో ప్రజాస్వామ్య సోషలిజాన్ని రూపొందించుకొని ప్రజల ప్రగతికి, సంక్షేమానికి ఉపయోగపడే విద్య, వైద్యం. రవాణ, శక్తి, గనులు, అంతరిక్షము, ఆధునిక దేవాలయమైన సాగునీటి ప్రాజెక్టులు ప్రభుత్వ రంగంలోనే ఏర్పాటు చేసాడు. వైజ్ఞానిక దృక్ఫథాన్ని హృదయంగా కల్గి ఉన్న నెహ్రు హోమిభాబా ఆధ్వర్యంలో అణుశక్తి కమిషన్‌కు ఏర్పాటు చేసాడు. అంతరిక్ష కార్యక్రమాల కోసం ఇస్రోను ఏర్పాటు చేసాడు. ఇప్పుడు దేశంలో ఉన్న ప్రతిష్టాత్మక ఐఐటి, నిట్‌, ఐఐయంలు , విశ్వవిద్యలయాలు , అన్ని పరిశోధన కేంద్రాలు రక్షణ పరిశ్రమలు నెహ్రు ఏర్పాటు చేసినవే. బాంబే ప్లాన్‌ వెలుగులో మిశ్రమ ఆర్థికవ్యవస్థను ఏర్పాటు చేసి స్వదేశి పెట్టుబడి దారులకు ప్రోత్సహాన్ని అందించాడు.

రష్యా విప్లవ ప్రేరణతో ప్రజాస్వామ్య సోషలిజాన్ని రూపొందించుకొని ప్రజల ప్రగతికి, సంక్షేమానికి ఉపయోగపడే విద్య, వైద్యం. రవాణ, శక్తి, గనులు, అంతరిక్షము, ఆధునిక దేవాలయమైన సాగునీటి ప్రాజెక్టులు ప్రభుత్వ రంగంలోనే ఏర్పాటు చేసాడు. – అస్నాల శ్రీనివాస్

హైందవ సమాజంలో స్త్రీలపై కొనసాగుతున్న వివక్ష, అణిచివేత విధానాలను తొలగించడానికి అంబేద్కర్‌ రూపొందించిన హిందూకోడ్‌ బిల్లులు అమోదం పొందడానికి నెహ్రు విశేష కృషి చేసాడు. తీవ్ర జాతీయవాద సంస్థలు ఈ బిల్లుకు వ్యతిరేకంగా తీవ్రంగా వ్యతిరేకించాయి. వీరి మూలపురుషుడు శ్యాంప్రసాద్‌ ముఖర్జీ నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చాడు. నెహ్రు అంబేద్కర్‌ విప్లవాత్మక కృషితో కొడుకులతో సమానంగా కూతుళ్ళకు సమానంగా వారసత్వ సంపద హక్కు, బహుభార్యత్వ నిషేధం, విడాకులు సులభతరం, కులాంతర వివాహాలు వంటి రక్షణలు మహిళలకు చేకూరబడ్డాయి.

హైందవ సమాజంలో స్త్రీలపై కొనసాగుతున్న వివక్ష, అణిచివేత విధానాలను తొలగించడానికి అంబేద్కర్‌ రూపొందించిన హిందూకోడ్‌ బిల్లులు అమోదం పొందడానికి నెహ్రు విశేష కృషి చేసాడు. -అస్నాల శ్రీనివాస్

తన నిండు జీవితాన్ని దేశం కోసం జీవించిన, నవభారత నిర్మాణానికి మహాత్తర చోదక నైతిక శక్తిగా పనిచేసిన వైజ్ఞానిక భారత్‌కు డి.యన్‌.ఎ.గా మారిన నెహ్రూ చేసిన నిరుపమాన కృషిని తక్కువ చేసేవిధంగా తీవ్ర జాతీయవాద పాలకులు పాల్పడుతున్నారు. ప్రగతిశీల ప్రజాస్వామ్య దృక్పథం ఉనికిలో ఉండడాన్ని సహించలేకపోతున్నారు , ప్రణాళికా వ్యవస్థను ,రాజ్యాంగ బద్ధ సంస్థలను అధికారకంగానే రద్దు చేస్తున్నారు . నెహ్రు వేసిన ప్రగతి బాటలను ప్రజల మది నుండి తొలగించే కుట్రలను చేస్తున్నారు.అలీనవిధానం , ప్రభుత్వ రంగ నిర్మాణం ,లౌకిక తత్వం వంటి విధానాలను తోసిపుచ్చుతున్నారు . బిజెపి పాలితరాష్ట్రాలలో నెహ్రు పాఠాలను తొలగించారు. ప్రతిష్టాత్మక నెహ్రు మోమోరియల్‌ మ్యూజియం, లైబ్రరీని తొలగించారు. పచ్చి అబద్ధాలతో కల్పితలతో శిఖర సమానుడైన నెహ్రు పై బురద చల్లుతున్నారు.

1953 సెప్టెంబర్‌ 20న కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులకు నెహ్రూ లేఖ రాస్తూ, తీవ్ర జాతీయవాదపు దుష్టరూప సంకుచిత భావాలు గల సంఘ పరివార్‌ సంస్థలు హిట్లర్‌ నాజీ పార్టీని అనుసరిస్తున్నాయి. అధిక సంఖ్యాకులకు తామే దేశమన్న భావనను కల్గించి ఆయుధ శిక్షణను ఇసున్నాయి. నాజీ పార్టీ జర్మనీని విద్వంసం చేసినట్లే ఈ సంస్థలు భారతదేశానికి కీడును కల్గిసాయి. సామాజిక, ఆర్థిక,న్యాయ విలువలతో కూడిన భారత నిర్మాణం దెబ్బతింటుంది. కావున ఈ శక్తులను నిలువరించకపోతే చరిత్ర మనలను క్షమించదు. నెహ్రు భావించినట్లే తీవ్ర జాతీయవాదులు పాలనకు వచ్చిన సారి విద్య, వైద్యం, ఆకలి, ఆర్థికవృద్ధి సూచికలు, అధమ స్థానాలకు చేరుతున్నాయి. నెహ్రు శ్రేయోమార్గ దార్శనికత, రాజ్యాంగ విలువల రక్షణ కోసము పౌరసమాజం చారిత్రక భాధ్యతను చేపట్టాల్సిన చారిత్రక సమయంఆసన్నమైంది.

అస్నాల శ్రీనివాస్‌
తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం