BIKKI NEWS (JULY 23) : NEET UG RE EXAM NOT REQUIRED SUPREME COURT. నీట్-యూజీ పరీక్షను మళ్లి నిర్వహించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
NEET UG RE EXAM NOT REQUIRED SUPREME COURT
పరీక్ష నిర్వహణలో వ్యవస్థాపరమైన లోపాలు ఉన్న మాట వాస్తవమేనని, అయితే ఈ లోపం వల్ల కేవలం 155 మంది అభ్యర్థులు లబ్ధి పొందారని, దాని కారణంగా మిగతా అభ్యర్థులందరికీ తిరిగి పరీక్ష నిర్వహించాల్సిన అసవరం లేదని దేశ సర్వోన్నత న్యాయస్థానం పేర్కొన్నది.
నీట్ పేపర్ లీకేజీ ద్వారా పరిమిత సంఖ్యలో మాత్రమే అభ్యర్థులు లబ్ధి పొందారని, ఆ లబ్ధిపొందిన అభ్యర్థులపై చర్యలు తీసుకోవాలని కోర్టు సూచించింది. పరీక్ష తిరిగి నిర్వహిస్తే మొత్తం 24 లక్షల మంది అభ్యర్థులు ఇబ్బందుల పాలవుతారని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ వ్యాఖ్యానించారు.