BIKKI NEWS (NOV. 04) : NEET UG EXAM IN TWO PHASES. జాతీయ స్థాయిలో మెడికల్ సీట్ల భర్తీ కొరకు నిర్వహించే నేషనల్ ఎలిజిబులిటి టెస్ట్ అండర్ గ్రాడ్యుయోట్ ను ఇక నుండి రెండు దశలలో నిర్వహించాలని రాధాకృష్ణన్ కమిషన్ నివేదిక ఇచ్చినట్లు సమాచారం.
NEET UG EXAM IN TWO PHASES
భారీ సంఖ్యలో విద్యార్థులు దరఖాస్తు చేసుకుంటున్న నేపథ్యంలో వడపోత కొరకు అభ్యర్దులకు అర్హత పరీక్ష నిర్వహించాలని తద్వారా రెండో పరీక్షకు అభ్యర్థులు తగ్గే అవకాశం ఉందని కమిటీ సూచించింది.
ఈ ఏడాది నీట్ యూజీ పరీక్షలకు దాదాపుగా 20 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే. అలాగే పేపర్ లీక్ మరియు కొంత మంది విద్యార్థులకు మార్కులు కలపడం వంటి అంశాలతో వార్తల్లో నిలిచింది.
ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇస్రో మాజీ చైర్మన్ రాధాకృష్ణన్ ఆధ్వర్యంలో నీట్ యూజీ మరియు CUET UG పరీక్షల నిర్వహణపై సూచనల కొరకు కమిటీ నియమించింది.
కమిటీ సూచనలు.!
NEET UG పరీక్షలను రెండు దశలలో నిర్వహించాలని సూచించారు.
మొదటి పరీక్ష అర్హత పరీక్షగా వడపోత కొరకు నిర్వహించాలి.
రెండో దశ పరీక్ష ఆధారంగా సీట్లు కేటాయించాలి.
మొదటి దశ పరీక్ష ఆన్లైన్ ద్వారా, రెండో దశ పరీక్ష ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ ద్వారా నిర్వహించాలని సూచించారు.
జేఈఈ తరహాలో మెయిన్స్ మరియు అడ్వాన్స్‌డ్ పద్దతిలో నిర్వహించాలని సూచించారు.
CUET UG లో పరీక్ష పేపర్లు సంఖ్య తగ్గించాలని సూచించారు.