BIKKI NEWS (SEP. 20) : neet ug 2024 locality issue. నీట్ యూజీ 2024 కౌన్సెలింగ్ లో స్థానికత వ్యవహారంలో తెలంగాణ విద్యార్థులకు ఊరట లభించింది. హైకోర్టును ఆశ్రయించిన విద్యార్థులు కౌన్సెలింగ్ కు హాజరయ్యేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది.
neet ug 2024 locality issue
కౌన్సెలింగ్ సమయం అతి తక్కువగా ఉండటంతో ఈ ఒక్కసారికి అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్లు ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు సుప్రీంకోర్టుకు తెలంగాణ ప్రభుత్వం తెలిపింది.
స్థానికత వ్యవహారంపై హైకోర్టు తీర్పును రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఈ పిటిషన్పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. ఈ ఒక్కసారికి హైకోర్టును ఆశ్రయించిన విద్యార్థులకు అవకాశం ఇవ్వనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాదులు తెలిపారు.
స్థానికతను నిర్ధరిస్తూ నాలుగు రాజ్యాంగ ధర్మాసనాల తీర్పులు ఉన్నాయని గుర్తు చేశారు. అన్ని తీర్పులు స్పష్టంగా ఉన్నా.. మళ్లీ కోర్టును ఆశ్రయించారన్నారు.