JNV LEST 2024 : నవోదయలో 9, 11 వ తరగతి అడ్మిషన్లు

హైదరాబాద్ (సెప్టెంబర్ – 20) : జవహర్ నవోదయ విద్యాలయాలలో (JNVS) 2024 – 25 విద్యా సంవత్సరానికై 9వ, 11వ తరగతులలో ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేయడానికి ప్రవేశ పరీక్ష (JNV LEST 2024 NOTIFICATION) ప్రకటనను విడుదల చేయడం జరిగింది.

లేటరల్ ఎంట్రీ ప్రవేశ పరీక్ష (NVS LEST 2024) ద్వారా ఖాళీ సీట్ల నిమిత్తం జవహర్ నవోదయ విద్యాలయాలలో తరగతులు IX & XIకు ప్రవేశం కోసం అర్హులైన అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు కోరబడుతున్నవి.

దరఖాస్తు గడువు : అక్టోబర్ 31 – 2023

JNV LEST పరీక్ష తేది: ఫిబ్రవరి 10 – 2024

★ ముఖ్యంశాలు

VI తరగతి నుండి XII తరగతి వరకు కో-ఎడ్యుకేషనల్ మరియు పూర్తిగా రెసిడెన్షియల్ పాఠశాలలు. CBSEకి అనుబంధంగా ఉంది.

ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు చెందిన ప్రతిభావంతులైన
బాలబాలికలకు మంచి నాణ్యమైన అధునిక విద్య.

బాలురు మరియు బాలికలకు వేర్వేరుగా హాస్టళ్లు. లొకేషన్ –
సాధారణంగా గ్రామీణ ప్రాంతాలలో,

వసతి, బస, యునిఫారాలు, టెక్స్ట్ బుక్స్, స్టేషనరీ మొ॥వాటితో పాటు ఉచిత విద్య.

పరిపూర్ణ వ్యక్తిగత వికాసం కోసం సహ-పాఠ్యాంశ కార్యకలాపాలు, గేమ్స్ & స్పోర్ట్స్, NCC, NSS, యోగా మొ||వాటిపై దృష్టి.

★ 11వ తరగతి ప్రవేశాలు :

అర్హత: జవహర్ నవోదయ విద్యాలయం పని చేస్తున్న చోట జిల్లాలోని ప్రభుత్వ / ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాల నుండి విద్యా సంవత్సరం 2023-24 (ఏప్రిల్ 2023 నుండి మార్చి 2024 సెషన్) / 2023 (జనవరి నుండి డిసెంబర్ 2023 సెషన్) లో అభ్యర్ధి తరగతి X చదివి ఉండాలి.

01-06-2007 నుండి 31-07-2009 (రెండు తేదీలు కలిపి) మధ్య జన్మించి ఉండవలెను

ఎంపిక పరీక్ష విధానం :

  • మెంటల్ ఎబిలిటీ, ఇంగ్లీష్, మ్యాథమ్యాటిక్స్, సైన్స్ & సోషల్ సైన్స్.
  • OMR బేస్డ్ ఆబ్జెక్టివ్ టైప్
  • ద్విభాషా ప్రశ్నాపత్రం (హిందీ మరియు ఇంగ్లీష్)
  • సిలబన్ మరియు ఎంపిక ప్రమాణాల కోసం, NVS ప్రకటన చూడండి.
  • తరగతి X చదివిన మరియు నివాసం ఉంటున్న జిల్లా ఒకటే అయినప్పుడు మాత్రమే అభ్యర్థి జిల్లా స్థాయి మెరిట్ కోసం పరిగణించబడతారు.
★ 9వ తరగతి ప్రవేశాలు

అర్హత: JNV పని చేస్తున్న మరియు వారు ప్రవేశం కోరుకునే జిల్లా లోని ప్రభుత్వ / ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో విద్యా సెషన్ 2023-24లో 8వ తరగతి అభ్యసించిన / నివాసులైన అభ్యర్ధులు మాత్రమే అర్హులవుతారు.

అభ్యర్ధి పుట్టిన తేది 01-05-2009 నుండి 31-07-2011 (రెండు తేదీలు కలిపి) మధ్య ఉండాలి. ఇది SC / ST / OBC కేటగిరీలకు చెందిన వారితో సహా అన్ని కేటగిరీల అభ్యర్థులుకు వర్తిస్తుంది.

ఎంపిక పరీక్ష విధానం

  • హిందీ, ఇంగ్లీష్, మ్యాథమ్యాటిక్స్, & సైన్స్
  • OMR బేస్డ్ ఆబ్జెక్టివ్ టైప్
  • ద్విభాషా ప్రశ్నాపత్రం (హిందీ మరియు ఇంగ్లీష్)
  • సిలబస్ మరియు ఎంపిక ప్రమాణాల కోసం, NVS ప్రకటనచూడండి.

★ వెబ్సైట్ : https://navodaya.gov.in/nvs/en/Home1