చరిత్రలో ఈరోజు సెప్టెంబర్ 05

★ దినోత్సవం

★ సంఘటనలు

1973: నాల్గవ అలీన దేశాల సదస్సు అల్జీర్స్ లో ప్రారంభమైనది.

★ జననాలు

1803: పురుషోత్తమ చౌదరి, తెలుగు క్రైస్తవ పదకవితా పితామహుడు. తొలి తెలుగు క్రైస్తవ వాగ్గేయకారుడు. (మ.1890)
1884: కల్లోజు గోపాలకృష్ణమాచార్యులు, ఆంధ్ర విశ్వకర్మ వంశీయుడు.
1888: సర్వేపల్లి రాధాకృష్ణన్, భారతదేశపు మొట్టమొదటి ఉపరాష్ట్రపతి, రెండవ రాష్ట్రపతి. (మ.1975)
1914: నికొనార్‌ పారా, చిలీ కవి. ‘అకవిత్వం’ అనే ప్రక్రియ సృష్టికర్త.
1922: రెంటాల గోపాలకృష్ణ, పత్రికా రచయిత, కవి. (జ.1922)
1926: జానమద్ది హనుమచ్ఛాస్త్రి, సెకండరీ గ్రేడు ఉపాధ్యాయుడు, రచయిత. (మ. 2014)
1927: పల్లెంపాటి వెంకటేశ్వర్లు, పారిశ్రామికవేత్త, కాకతీయ సిమెంట్స్‌ వ్యవస్థాపకుడు. (మ.2016)
1955: ఎం.కోదండరాం, తెలంగాణ ఉద్యమ నాయకుడు.
1966: గుమ్మన్నగారి బాలశ్రీనివాసమూర్తి: సాహితీవేత్త, పరిశోధకుడు, పత్రిక సంపాదకుడు. (మ. 2023)

★ మరణాలు

1986: గణపతి తనికైమొని భారతీయ పాలినాలజిస్ట్. (జ.1938)
1997: మదర్ థెరీసా, రోమన్ కేథలిక్ సన్యాసిని, మానవతావాది, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత. (జ.1910)
2010: హోమీ సేత్నా, భారతీయ శాస్త్ర పరిశోధకుడు. (జ.1923)
2013: చల్లా కృష్ణనారాయణరెడ్డి, హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు, మాజీ శాసన సభ్యుడు. (జ.1925).
2017: గౌరీ లంకేష్‌, భారతీయ జర్నలిస్టు, ఉద్యమకారిణి, బెంగళూరు, కర్ణాటక. (జ. 1962).