BIKKI NEWS : list of national symbols of india and explanation in telugu. పోటీ పరీక్షల నేపథ్యంలో భారతదేశం జాతీయ చిహ్నాలు పూర్తి విశ్లేషణ చూద్దాం.
list of national symbols of india and explanation in telugu
★ భారతదేశ జాతీయ చిహ్నం :-
- లయన్ క్యాపిటల్ (సారసాద్ లోని అశోకుని ధర్మస్థూపం పై ఉండే సింహాలు)
- అశోకుని స్థూపం పై 4 సింహలు ఉంటాయి. మూడు సింహాలు మాత్రమే కనిపిస్తాయి.
- పీఠం మధ్య భాగంలో ధర్మచక్రం ఉంటుంది. ధర్మ చక్రానికి కుడివైపు వృషభం (ఎద్దు) ఉంటుంది. ఇది స్థిరత్వానికి సంకేతం. ఎడమ వైపు గుర్రం ఉంటుంది. ఇవి రెండే కాక ఏనుగు, సింహం కూడా ఉంటాయి. ఇవి మనకు కనిపించవు.
- పీఠభాగం పై “సత్యమేవ జయతే” అనే వాక్యం దేవనాగరి లిపిలో ఉంటుంది. ఈ వాక్యం మాండకోపనిషత్ నుండి గ్రహింపబడింది.
- జాతీయచిహ్నం 1950 జనవరి 26న ఆమోదం పొందింది.
★ జాతీయ గీతం :-
- జనగణమన” మన జాతీయ గీతం. రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన పూర్తి గీతంలో 5 చరణా లున్నాయి.
- తొలి చరణంలో 5 లైన్లను జాతీయ గీతంగా ఆమోదించారు.
- ఈ గీతాన్ని తొలిసారిగా 1911, డిసెంబర్ 27న కలకత్తా కాంగ్రెస్ సమావేశంలో పాడారు.
- ఠాగూర్ తత్వబోధిని పత్రికలో భారత విధాత పేరుతో ఈ గీతం తొలిసారిగా 1912లో ప్రచురితం అయ్యింది.
- ఈ గీతాన్ని ఠాగూర్ “మార్నింగ్ సాంగ్ ఆఫ్ ఇండియా” పేరుతో 1919లో ఆంగ్లంలోకి అనువదించారు.
- జాతీయగీతం 1950 జనవరి 24 నుండి అధికారికంగా వాడుకలోకి వచ్చింది.
- జాతీయగీతం తొలుత బెంగాలీ భాషలో రాయబడింది
- పూర్తి జాతీయ గీతాన్ని పాడటానికి తీసుకోవలసిన సమయం 52 సెకన్లు. షార్ట్ వెర్షన్ (సంక్షిప్తంగా పాడటానికి) తీసుకోవలసిన సమయం 20 సెకన్లు.
★ జాతీయ జలచరం (ఆక్వాటిక్ యానిమల్) :-
- కేంద్రప్రభుత్వం డాల్ఫిన్ ను 2009 అక్టోబరు లో జాతీయ జలచరంగా గుర్తించింది.
- డాల్ఫిన్ శాస్త్రీయ నామం ప్లాటినెష్టా గాంజెటికా.
- డాల్ఫిన్ ను భారత వన్యప్రాణి సంరక్షణా చట్టం 1972లోని షెడ్యూలు-1లో చేర్చారు.
- జాతీయ జంతువు, జాతీయ పక్షి, జాతీయ జలచరం వంటి వాటిని హింసించడం, చంపడం వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 ప్రకారం నేరం.
★ జాతీయ వృక్షం :-
- మర్రిచెట్టు (ఫైకస్ బెంగలెన్సెస్)
★ జాతీయ పుష్పం :-
- తామరపువ్వు (నెలుంబో న్యూసిఫెరా గెర్టన్)
- తామరపువ్వు నాగరికత, సంస్కృతికి చిహ్నం.
★ జాతీయఫలం :-
- మామిడి (మ్యాంజీఫెరా ఇండికా)
★ జాతీయ సరీసృపం : కింగ్ కోబ్రా
★ జాతీయ క్రీడ :- హాకీ
◆ జాతీయ సూక్ష్మ జీవి
: లాక్టోబాసిల్లస్ డెల్బ్రూకీ
★ జాతీయ నది :- గంగానది (2008లో ప్రకటించారు)
★ జాతీయ నినాదం : సత్యమేవ జయతే
★ జాతీయ వారసత్వ జంతువు:-
- ఏనుగు (2010లో ప్రకటించారు)
★ భారత జాతీయ కాలమానం :-
- 82 1/2° తూర్పురేఖాంశం అనుసరించి భారత కాలమానాన్ని నిర్ణయిస్తారు.
- గ్రీనిచ్ కాలమానం కంటే భారత కాలమానం 5.30 గంటల ముందు ఉంటుంది.
★ జాతీయ జంతువు :-
- మన జాతీయ జంతువు పెద్దపులి (రాయల్ బెంగాల్ టైగర్) పెద్దపులి శాస్త్రీయ నామం పాంథారా టైగ్రిస్ (లిన్నేయస్)
- 1972 వరకు సింహం జాతీయ జంతువుగా ఉండేది.
- పెద్ద పులిని జాతీయ జంతువుగా 1972లో గుర్తించారు.
- పులి అనేది శక్తికి, ధైర్యానికి ప్రతీక
- 1973 నుంచి దేశంలో ‘ప్రాజెక్ట్ టైగర్’ ను ప్రారంభించారు.
★ జాతీయ పక్షి :-
- మన జాతీయ పక్షి నెమలి
- నెమలిని మన జాతీయ పక్షిగా 1964లో గుర్తించారు.
- నెమలి శాస్త్రీయనామం : పావో క్రిస్టేటస్.
★ జాతీయ క్యాలెండర్ :-
- జాతీయ కాలెండర్ను గేగేరియన్ క్యాలెండర్ ఆధారంగా 1957 మార్చి 22 నుంచి తయారు చేసారు.
- ఈ కాలెండరు శక సంవత్సరం (1879) ఆధారంగా చైత్రం తొలిమాసం ఫాల్గుణం చివరిమాసం ఆధారంగా రూపొందించారు.
- శక సంవత్సరం క్రీ.శ 78న ప్రారంభమైంది.
- శక సంవత్సరంలో రోజుల సంఖ్య : 365.
- సాధారణ శక సంవత్సరం మార్చి 22తో ప్రారంభమవుతుంది.
- లీపు సంవత్సరంలో మార్చి 21తో ప్రారంభనుమతుంది.
★ జాతీయ గేయం :-
- “వందేమాతరం” బంకించంద్ర చటర్జీ రాసిన “ఆనంద్ మఠ్” నవలలోని వందేమాతరం మన జాతీయ గేయం.
- “ఆనంద మఠ్” నవల 1882లో ప్రచురింపబడింది. సంస్కృతంలో రాసారు.
- దీన్ని అరవింద ఘోష్ ఆంగ్లంలోకి అనువదించారు.
- వందేమాతరం గేయాన్ని 1896లో కలకత్తాలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో తొలిసారిగా పాడారు.
- వందేమాతరం గేయాన్ని జనవరి 24, 1950లో మన రాజ్యాంగ సభ జాతీయ గేయంగా ఆమోదించింది.
★ జాతీయ పతాకం :-
- మన జాతీయ పతాకం కాషాయం, తెలుపు, ఆకుపచ్చ వర్ణాలతో కూడిన త్రివర్ణ పతాకం.
- ఈ పతాకం పొడవు, వెడల్పుల నిష్పత్తి 3:2
- దేశ సమగ్రతకు, సమైక్యతకు ప్రతీక అయిన ఈ త్రివర్ణ పతాకములో పైన కాషాయం, మధ్య తెలుపు, కింద ఆకుపచ్చ రంగులు ఉంటాయి..
- కాషాయం ధైర్యానికి, త్యాగనిరతికి, దేశభక్తికి
- తెలుపు శాంతికి, సత్యానికి
- ఆకుపచ్చ విశ్వాసం, పరాక్రమానికి, నమ్మకానికి చిహ్నాలు
- తెలుపు రంగు మధ్య భాగంలో ముదురు నీలం రంగు (నావీ బ్లూ)తో అశోకచక్రం ఉంటుంది. (చక్రం అభివృద్ధికి సంకేతం).
- ఈ చక్రంలో 24 ఆకులు (Spokes) ఉంటా యి. దీనిలో గల 24 ఆకులు 24 గంటలకు, ధర్మానికి, న్యాయానికి, క్రమశిక్షణకు సంకేతం. ఈ ధర్మచక్రం భారత దేశ ప్రాచీన సంస్కృతికి చిహ్నం.
- త్రివర్ణ పతాకాన్ని రాజ్యాంగ సభ 1947, జూలై 22న జాతీయ పతాకంగా ఆమోదించింది.
- మన జాతీయ జెండాను అధికారికంగా 1947, ఆగస్టు 14 అర్ధరాత్రి ప్రదర్శించారు. దీనిని తొలిసారిగా పార్లమెంట్ పై ఎగురవేశారు.
◆ జెండా పూర్వాపరాలు:-
- తొలిసారిగా 1921లో విజయవాడలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కు చెందిన పింగళి వెంకయ్య గారు రూపొందించిన జాతీయ పతాకం ప్రదర్శించారు.
- తెల్లపట్టీ మధ్యలో తొలుత ‘చరఖా’ ఉండేది. తర్వాత దీని స్థానంలో సారనాధ్ స్టూపంలోని అశోకచక్రం ను రూపొందించారు.