national symbols : భారతదేశం జాతీయ చిహ్నాలు – పూర్తి విశ్లేషణ

BIKKI NEWS : పోటీ పరీక్షల నేపథ్యంలో భారతదేశం జాతీయ చిహ్నాలు (list of national symbols of india and explanation) – పూర్తి విశ్లేషణ చూద్దాం.

★ భారతదేశ జాతీయ చిహ్నం :-

 • లయన్ క్యాపిటల్ (సారసాద్ లోని అశోకుని ధర్మస్థూపం పై ఉండే సింహాలు)
 • అశోకుని స్థూపం పై 4 సింహలు ఉంటాయి. మూడు సింహాలు మాత్రమే కనిపిస్తాయి.
 • పీఠం మధ్య భాగంలో ధర్మచక్రం ఉంటుంది. ధర్మ చక్రానికి కుడివైపు వృషభం (ఎద్దు) ఉంటుంది. ఇది స్థిరత్వానికి సంకేతం. ఎడమ వైపు గుర్రం ఉంటుంది. ఇవి రెండే కాక ఏనుగు, సింహం కూడా ఉంటాయి. ఇవి మనకు కనిపించవు.
 • పీఠభాగం పై “సత్యమేవ జయతే” అనే వాక్యం దేవనాగరి లిపిలో ఉంటుంది. ఈ వాక్యం మాండకోపనిషత్ నుండి గ్రహింపబడింది.
 • జాతీయచిహ్నం 1950 జనవరి 26న ఆమోదం పొందింది.

★ జాతీయ గీతం :-

 • జనగణమన” మన జాతీయ గీతం. రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన పూర్తి గీతంలో 5 చరణా లున్నాయి.
 • తొలి చరణంలో 5 లైన్లను జాతీయ గీతంగా ఆమోదించారు.
 • ఈ గీతాన్ని తొలిసారిగా 1911, డిసెంబర్ 27న కలకత్తా కాంగ్రెస్ సమావేశంలో పాడారు.
 • ఠాగూర్ తత్వబోధిని పత్రికలో భారత విధాత పేరుతో ఈ గీతం తొలిసారిగా 1912లో ప్రచురితం అయ్యింది.
 • ఈ గీతాన్ని ఠాగూర్ “మార్నింగ్ సాంగ్ ఆఫ్ ఇండియా” పేరుతో 1919లో ఆంగ్లంలోకి అనువదించారు.
 • జాతీయగీతం 1950 జనవరి 24 నుండి అధికారికంగా వాడుకలోకి వచ్చింది.
 • జాతీయగీతం తొలుత బెంగాలీ భాషలో రాయబడింది
 • పూర్తి జాతీయ గీతాన్ని పాడటానికి తీసుకోవలసిన సమయం 52 సెకన్లు. షార్ట్ వెర్షన్ (సంక్షిప్తంగా పాడటానికి) తీసుకోవలసిన సమయం 20 సెకన్లు.

★ జాతీయ జలచరం (ఆక్వాటిక్ యానిమల్) :-

 • కేంద్రప్రభుత్వం డాల్ఫిన్ ను 2009 అక్టోబరు లో జాతీయ జలచరంగా గుర్తించింది.
 • డాల్ఫిన్ శాస్త్రీయ నామం ప్లాటినెష్టా గాంజెటికా.
 • డాల్ఫిన్ ను భారత వన్యప్రాణి సంరక్షణా చట్టం 1972లోని షెడ్యూలు-1లో చేర్చారు.
 • జాతీయ జంతువు, జాతీయ పక్షి, జాతీయ జలచరం వంటి వాటిని హింసించడం, చంపడం వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 ప్రకారం నేరం.

★ జాతీయ వృక్షం :-

 • మర్రిచెట్టు (ఫైకస్ బెంగలెన్సెస్)

★ జాతీయ పుష్పం :-

 • తామరపువ్వు (నెలుంబో న్యూసిఫెరా గెర్టన్)
 • తామరపువ్వు నాగరికత, సంస్కృతికి చిహ్నం.

★ జాతీయఫలం :-

 • మామిడి (మ్యాంజీఫెరా ఇండికా)

★ జాతీయ సరీసృపం : కింగ్ కోబ్రా

★ జాతీయ క్రీడ :- హాకీ

◆ జాతీయ సూక్ష్మ జీవి : లాక్టోబాసిల్లస్ డెల్‌బ్రూకీ

★ జాతీయ నది :- గంగానది (2008లో ప్రకటించారు)

★ జాతీయ నినాదం : సత్యమేవ జయతే

★ జాతీయ వారసత్వ జంతువు:-

 • ఏనుగు (2010లో ప్రకటించారు)

★ భారత జాతీయ కాలమానం :-

 • 82 1/2° తూర్పురేఖాంశం అనుసరించి భారత కాలమానాన్ని నిర్ణయిస్తారు.
 • గ్రీనిచ్ కాలమానం కంటే భారత కాలమానం 5.30 గంటల ముందు ఉంటుంది.

★ జాతీయ జంతువు :-

 • మన జాతీయ జంతువు పెద్దపులి (రాయల్ బెంగాల్ టైగర్) పెద్దపులి శాస్త్రీయ నామం పాంథారా టైగ్రిస్ (లిన్నేయస్)
 • 1972 వరకు సింహం జాతీయ జంతువుగా ఉండేది.
 • పెద్ద పులిని జాతీయ జంతువుగా 1972లో గుర్తించారు.
 • పులి అనేది శక్తికి, ధైర్యానికి ప్రతీక
 • 1973 నుంచి దేశంలో ‘ప్రాజెక్ట్ టైగర్’ ను ప్రారంభించారు.

★ జాతీయ పక్షి :-

 • మన జాతీయ పక్షి నెమలి
 • నెమలిని మన జాతీయ పక్షిగా 1964లో గుర్తించారు.
 • నెమలి శాస్త్రీయనామం : పావో క్రిస్టేటస్.

★ జాతీయ క్యాలెండర్ :-

 • జాతీయ కాలెండర్‌ను గేగేరియన్ క్యాలెండర్ ఆధారంగా 1957 మార్చి 22 నుంచి తయారు చేసారు.
 • ఈ కాలెండరు శక సంవత్సరం (1879) ఆధారంగా చైత్రం తొలిమాసం ఫాల్గుణం చివరిమాసం ఆధారంగా రూపొందించారు.
 • శక సంవత్సరం క్రీ.శ 78న ప్రారంభమైంది.
 • శక సంవత్సరంలో రోజుల సంఖ్య : 365.
 • సాధారణ శక సంవత్సరం మార్చి 22తో ప్రారంభమవుతుంది.
 • లీపు సంవత్సరంలో మార్చి 21తో ప్రారంభనుమతుంది.

★ జాతీయ గేయం :-

 • వందేమాతరం” బంకించంద్ర చటర్జీ రాసిన “ఆనంద్ మఠ్” నవలలోని వందేమాతరం మన జాతీయ గేయం.
 • “ఆనంద మఠ్” నవల 1882లో ప్రచురింపబడింది. సంస్కృతంలో రాసారు.
 • దీన్ని అరవింద ఘోష్ ఆంగ్లంలోకి అనువదించారు.
 • వందేమాతరం గేయాన్ని 1896లో కలకత్తాలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో తొలిసారిగా పాడారు.
 • వందేమాతరం గేయాన్ని జనవరి 24, 1950లో మన రాజ్యాంగ సభ జాతీయ గేయంగా ఆమోదించింది.

★ జాతీయ పతాకం :-

 • మన జాతీయ పతాకం కాషాయం, తెలుపు, ఆకుపచ్చ వర్ణాలతో కూడిన త్రివర్ణ పతాకం.
 • ఈ పతాకం పొడవు, వెడల్పుల నిష్పత్తి 3:2
 • దేశ సమగ్రతకు, సమైక్యతకు ప్రతీక అయిన ఈ త్రివర్ణ పతాకములో పైన కాషాయం, మధ్య తెలుపు, కింద ఆకుపచ్చ రంగులు ఉంటాయి..
 • కాషాయం ధైర్యానికి, త్యాగనిరతికి, దేశభక్తికి
 • తెలుపు శాంతికి, సత్యానికి
 • ఆకుపచ్చ విశ్వాసం, పరాక్రమానికి, నమ్మకానికి చిహ్నాలు
 • తెలుపు రంగు మధ్య భాగంలో ముదురు నీలం రంగు (నావీ బ్లూ)తో అశోకచక్రం ఉంటుంది. (చక్రం అభివృద్ధికి సంకేతం).
 • ఈ చక్రంలో 24 ఆకులు (Spokes) ఉంటా యి. దీనిలో గల 24 ఆకులు 24 గంటలకు, ధర్మానికి, న్యాయానికి, క్రమశిక్షణకు సంకేతం. ఈ ధర్మచక్రం భారత దేశ ప్రాచీన సంస్కృతికి చిహ్నం.
 • త్రివర్ణ పతాకాన్ని రాజ్యాంగ సభ 1947, జూలై 22న జాతీయ పతాకంగా ఆమోదించింది.
 • మన జాతీయ జెండాను అధికారికంగా 1947, ఆగస్టు 14 అర్ధరాత్రి ప్రదర్శించారు. దీనిని తొలిసారిగా పార్లమెంట్ పై ఎగురవేశారు.

◆ జెండా పూర్వాపరాలు:-

 • తొలిసారిగా 1921లో విజయవాడలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కు చెందిన పింగళి వెంకయ్య గారు రూపొందించిన జాతీయ పతాకం ప్రదర్శించారు.
 • తెల్లపట్టీ మధ్యలో తొలుత ‘చరఖా’ ఉండేది. తర్వాత దీని స్థానంలో సారనాధ్ స్టూపంలోని అశోకచక్రం ను రూపొందించారు.