BIKKI NEWS (AUG. 23) : National Space Day On August 23rd. చంద్రయాన్ – 3 విజయవంతంగా జాబిల్లిని ముద్దాడిన రోజు ఆగస్టు 23ను నేషనల్ స్పేస్ డే గా ప్రకటించారు.
National Space Day On August 23rd.
ఆగస్టు 23న విక్రమ్ ల్యాండర్ చంద్రుని పై దిగిన చోటుకు “శివశక్తి” (SHIVA SHAKTHI) అని నామకరణం చేశారు.
చంద్రయాన్ 2 చంద్రుని పై దిగిన ప్రదేశానికి “తిరంగా స్పాట్ ” (TIRANGA SPOT) అని నామకరణం చేశారు.
National Space day 2024 theme
Touching Lives while
Touching the Moon
India’s Space saga
చంద్రయాన్-3 మిషన్ ఆగస్టు 23, 2023న చంద్రుని ఉపరితలంపై విక్రమ్ ల్యాండర్‌ను సురక్షితంగా మరియు సాఫ్ట్‌గా ల్యాండింగ్ చేసింది. దీనితో, చంద్రునిపై దిగిన నాల్గవ దేశంగా మరియు చంద్రుని దక్షిణ ధ్రువ ప్రాంతానికి సమీపంలో ల్యాండ్ అయిన మొదటి దేశంగా భారత్ అవతరించింది.
సాఫ్ట్ ల్యాండింగ్ తరువాత ప్రజ్ఞాన్ రోవర్ విజయవంతంగా విస్తరణ జరిగింది. ల్యాండింగ్ సైట్‌కు ‘శివశక్తి’ పాయింట్ (స్టేటియో శివశక్తి) అని పేరు పెట్టారు మరియు ఆగస్టు 23ని “జాతీయ అంతరిక్ష దినోత్సవం”గా ప్రకటించారు. భారతదేశం తన తొలి జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని ఆగస్టు 23, 2024న జరుపుకోనుంది.
ఇప్పటికే చంద్రుని మీద ప్రయోగాల కొరకు చంద్రయాన్ – 1, 2, 3 లను ప్రయోగించిన ఇస్రో తాజాగా చంద్రయాన్ – 4, 5 లను కూడా సిద్ధం చేసింది. కేంద్ర ప్రభుత్వం అనుమతి తర్వాత ఈ ప్రయోగాలను చేపట్టాలని వేచి చూస్తుంది.
భారతదేశం సూర్యుడి మీద ప్రయోగాల కోసం ఆదిత్య ఎల్1 మిషన్ ను కూడా విజయవంతంగా లాంగ్రేజియన్ కక్ష్య లో ప్రవేశపెట్టింది.
అలాగే అంగారక గ్రహం పై ప్రయోగాలు కోసం ఇస్రో మామ్ ప్రయోగాన్ని విజయవంతంగా చేపట్టిన సంగతి తెలిసిందే.
అంతరిక్షంలోకే కాకుండా సముద్రపు లోతులను చూడడానికి సముద్రయాన్ ప్రయోగాన్ని కూడా త్వరలోనే చేపట్టనుంది.