NIOS ADMISSIONS : నేషనల్ ఓపెన్ స్కూల్ అడ్మిషన్లు

హైదరాబాద్ (ఆగస్టు 16) : భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని బోర్డు – నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూల్ (NIOS ADMISSIONS) 2023 – 24 విద్యా సంవత్సరానికి CBSE/CISCEకి సమానమైన పదో తరగతి, ఇంటర్మీడియట్ కోర్సులకు దూరవిద్య, డిస్టెన్స్ విధానంలో అడ్మిషన్లకు దరఖాస్తు లు ఆహ్వానిస్తుంది.

ఏప్రిల్, 2024 సెషన్ లో పబ్లిక్ పరీక్షలు కోసం సెకండరీ (10వ తరగతి) మరియు సీనియర్ సెకండరీ (12వ తరగతి) అడ్మిషన్ జరుగుతున్నాయి. ప్రవేశం పొందుటకు చివరి తేది 15 సెప్టెంబర్ 2023. ఎలాంటి ప్రాథమిక విద్యార్హత లేకుండా 14 ఏళ్లు నిండిన ఆసక్తిగల అభ్యర్థులు స్వీయ- ధృవీకరణ ఆధారంగా సెకండరీ కోర్సులో ప్రవేశం పొందేందుకు అర్హులు. సెకండరీ ఉత్తీర్ణులైన విద్యార్థులు సీనియర్ సెకండరీకి నమోదు చేసుకోవడానికి అర్హులు.

రిజిస్ట్రేషన్ ఐదేళ్లపాటు చెల్లుబాటవుతుంది. మరిన్ని వివరాల కోసం ప్రాంతీయ కేంద్రాన్ని సంప్రదించండి లేదా www.nios.ac.in ని సందర్శించండి.