హైదరాబాద్ (ఆగస్టు – 24) : National Film Awards 2023 ను ఈ రోజు ప్రకటించారు. 69వ జాతీయ చలన చిత్ర అవార్డులో జాతీయ ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం గా RRR సినిమా నిలిచింది. జాతీయ ఉత్తమ నటుడు గా అల్లు అర్జున్(పుష్ప) నిలిచాడు. 69 ఏళ్ళలో తెలుగు నటుడికి జాతీయ ఉత్తమ నటుడు అవార్డు రావడం విశేషం. ఉత్తమ నటిగా అలియా భట్ (గంగుభాయ్ కతియావాడి) కృతిసనన్ (మీమీ) నిలిచారు. ఉత్తమ చిత్రం గా రాకెట్రీ నిలిచింది.
2021 ఏడాదికిగాను చలనచిత్ర పురస్కారాలు ప్రకటించారు. 28 భాషల్లో 280 సినిమాలు వివిధ విభాగాల్లో పోటీపడ్డాయి.
RRR సినిమాకు మరిన్ని అవార్డులు దక్కాయి. బెస్ట్ బీజీఎం – కీరవాణి, బెస్ట్ కొరియోగ్రఫి – నాటు నాటు – ప్రేమ్ రక్షిత్, స్టంట్ కోరియోగ్రపి, స్పెషల్ ఎపెక్ట్స్ విభాగాలలో అవార్డులు దక్కించుకుంది.
జాతీయ ఉత్తమ గీత రచయిత చంద్రబోస్ (కొండపొలం) చిత్రానికి దక్కింది.ఉత్తమ తెలుగు సినిమా ఉప్పెన నిలిచింది.
NATIONAL FILM AWARDS WINNERS LIST
జాతీయ ఉత్తమ చిత్రం – రాకెట్రీ (హిందీ)
ఉత్తమ జనాదరణ పొందిన చిత్రం – RRR
ఉత్తమ దర్శకుడు – నిఖిల్ మహాజన్ (గోదావరి) (మరాఠీ)
ఉత్తమ తెలుగు సినిమా : ఉప్పెన
ఉత్తమ నటుడు : అల్లు అర్జున్ (పుష్ప)
ఉత్తమ నటి – అలియాభట్ (గంగూబాయ్ కథియావాడి), కృతిసనన్ (మీమీ)
ఉత్తమ సహయ నటి.- పల్లవి జోషి (ది కాశ్మీరీ ఫైల్స్)
ఉత్తమ సహాయ నటుడు – పంకజ్ త్రిపాఠి (మీమీ)
బెస్ట్ స్టంట్ కొరియోగ్రాఫర్: కింగ్ సోలోమన్ (ఆర్‌ఆర్‌ఆర్)
బెస్ట్ కొరియోగ్రఫర్‌గా ప్రేమ్‌రక్షిత్ (ఆర్‌ఆర్‌ఆర్)
బెస్ట్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ : ఎంఎం కీరవాణి
ప్లేబ్యాక్ సింగర్ : కాలభైరవ (ఆర్‌ఆర్‌ఆర్)
బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్ : ఆర్ఆర్‌ఆర్
ఉత్తమ లిరికిస్ట్ చంద్రబోస్(కొండపొలం)
బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్: దేవీ శ్రీ ప్రసాద్ (పుష్ప)
బెస్ట్ తెలుగు ఫిల్మ్ క్రిటిక్: పురుషోత్తమ చార్యులు
బెస్ట్ హిందీ ఫిల్మ్: సర్దార్ ఉధమ్
ఉత్తమ నేపథ్య గాయనీ – శ్రేయాఘోషల్ .(మాయవా చాయవా)
ఉత్తమ నేపథ్య గాయకుడు – కాల భైరవ (కోమురం భీముడో)
బెస్ట్ గుజరాతీ ఫిల్మ్: ఛల్లో షో
ఉత్తమ ఎడిటింగ్ – సంజయ్ లీలా భన్సాలీ (గంగూబాయ్ కథియావాడి)
ఉత్తమ స్క్రీన్ ప్లే – నాయట్టు (మళయాళం)
ఉత్తమ బాల నటుడు – భావిన్ రభారి (ఛల్లో షో)
Comments are closed.