Home > ESSAYS > NATIONAL EDUCATION DAY – జాతీయ విద్యా దినోత్సవం

NATIONAL EDUCATION DAY – జాతీయ విద్యా దినోత్సవం

BIKKI NEWS (NOV – 11) : జాతీయ విద్యా దినోత్సవం (NATIONAL EDUCATION DAY NOVEMBER 11th) ప్రతి సంవత్సరం నవంబరు 11వ తేదీన నిర్వహించబడుతుంది. స్వాతంత్ర్య సమర యోధుడు, భారత ప్రభుత్వ తొలి విద్యా శాఖా మంత్రి అయిన మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ పుట్టిన రోజు సందర్భంగా ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు.

NATIONAL EDUCATION DAY NOVEMBER 11th

మౌలానా అబుల్ కలాం ఆజాద్ భారత ప్రభుత్వంలో 11 సంవత్సరాలపాటు విద్యా శాఖా మంత్రిగా పని చేసాడు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ గౌరవార్ధం ఆయన పుట్టిన రోజును జాతీయ విద్యా దినోత్సవంగా జరుపుకోవాలని 2008, సెప్టెంబరు 11న కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

మౌలానా అబుల్ కలాం ఆజాద్ (1888 నవంబరు 11 – 1958 ఫిబ్రవరి 22) స్వాతంత్ర్య సమర యోధుడు, భారత ప్రభుత్వ తొలి విద్యా శాఖా మంత్రి, మౌలానా అబుల్ కలాం ఆజాద్. అతను అసలు పేరు “మొహియుద్దీన్ అహ్మద్”, ‘అబుల్ కలాం’ అనేది బిరుదు, ‘ఆజాద్’ కలం పేరు. ఆలియా బేగమ్, ఖైరుద్దీన్ అహమ్మద్ లకు 1888 నవంబరు 11 న మక్కాలో జన్మించాడు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ భారత స్వాతంత్ర్య సమర ముఖ్య నాయకులలో ఒకడు. అతను ప్రఖ్యాత పండితుడు, కవి. మౌలానా అబుల్ కలాం ఆజాద్ అరబిక్, ఇంగ్లీష్, ఉర్దూ, హిందీ, పెర్షియన్, బెంగాలీ మొదలగు అనేక భాషలలో ప్రావీణ్యుడు.

గాంధీజీ ఇతడిని భారత ప్లాటో అని, గాంధీ , నెహ్రూ ఇతడిని మౌలానా, మీర్- ఎ- కారవాన్‌ అని పిలిచేవారు. భారత ప్రభుత్వం మరణానంతరం (1888-1958) 1992లో అతనికి భారత రత్న ఇచ్చి గౌరవించింది.

తర్జుమానుల్ ఖురాన్ (ఖురాన్ అనువాదం) “అల్- హిలాల్” , “అల్- బలాగ్” అనే పత్రికలు స్థాపించాడు. గుబార్ -ఎ-ఖాతిర్, ఇండియా విన్స్ ఫ్రీడమ్ వంటి గ్రంధాలు రచించాడు.

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు