BIKKI NEWS (NOV 25) : భూమి మీద అత్యంత వేగంగా ప్రయాణంచే అవకాశాన్ని మానవులకు NASA తన సూపర్ సోనిక్ విమానం X59 తో కల్పించనుంది (NASA X59 SUPER SONIC AEROPLANE). ఇది సైద్ధాంతికంగా గంటకు 2,400 కిలోమీటర్ల నుంచి 4,900 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు.
‘కంకార్డ్’ విమానం తర్వాత ప్రయాణికులను అత్యంత గమ్య స్థానాలకు చేర వేసేందుకు మరో సూపర్ సోనిక్ విమానంగా X59 నిలవనుంది.
ఈ X59 సూపర్ సోనిక్ విమానం ద్వారా న్యూయార్క్ నగరం నుంచి లండన్ నగరానికి కేవలం 90 నిమిషాల్లో చేరుకోవచ్చు. పైగా కంకార్డ్ విమానం మాదిరిగా విపరీతమైన శబ్దం చేయదు.
సూపర్ సోనిక్ వేగంతో ప్రయాణించేటప్పుడు ఉత్పన్నమయ్యే తీవ్ర అతిధ్వనులు ‘సోనిక్ బూమ్’ను కలిగించకపోవడం దీని ప్రత్యేకత.
ప్రస్తుతం ఈ విమానం తుది మెరుగుల కోసం కాలిఫోర్నియాలోని లాక్ హీడ్ మార్టిన్ కర్మాగారంలో ఉన్నది. అతి త్వరలోనే ఇది పౌరవిమానయాన రంగంలో సంచలనం కాబోతుంది.