MPHW (F) ADMISSIONS : ఇంటర్ మార్కులతో అడ్మిషన్లు

విజయవాడ (సెప్టెంబర్ – 22) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 59 ప్రభుత్వ/ ప్రైవేటు విద్యా సంస్థల్లో 2023 – 24 విద్యా సంవత్సరానికి గాను MPHW (FEMALE) ADMISSIONS 2023 కోసం దరఖాస్తు ఆహ్వానిస్తూ ప్రకటన వెలువడింది.

ఈ ట్రైనింగ్ కోర్సులో ప్రవేశానికి ఇంటర్మీడియట్ లో ఏ గ్రూప్ అయినా ఉత్తీర్ణత సాదించిన అభ్యర్థుల నుండి దరఖాస్తులను సెప్టెంబర్ 30 లోపల ఆహ్వానిస్తూ ప్రకటన విడుదల చేశారు.

కోర్సు వివరాలు:

మల్టీపర్పస్ హెల్త్ వర్కర్స్ (ఫీమేల్) ట్రైనింగ్ కోర్సు

అర్హతలు : ఏదైనా గ్రూప్ ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత.

వయోపరిమితి: 31-12-2023 నాటికి 17 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.

ఎంపిక ప్రక్రియ : ఇంటర్మీడియట్ మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా.

దరఖాస్తు విధానం : ప్రత్యక్ష పద్దతిలో (off line)

దరఖాస్తు గడువు : సెప్టెంబర్ 30 – 2023.

ఎంపిక జాబితా వెల్లడి తేదీ : అక్టోబర్ 15 – 2023.

తరగతుల ప్రారంభం : అక్టోబర్ – 21 – 2023.