BIKKI NEWS (ఎప్రిల్ – 10) : గడిచిన 1.25 లక్షల సంవత్సరాలుగా భూమి మీద నమోదైన అత్యధిక ఉష్ణోగ్రతలు మార్చి 2024లో (MOST HOTTEST MONTH IS MARCH 2024) నమోదయ్యాయి. గత పది నెలలుగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతునే ఉన్నాయి. ప్రతి నెల గత నెల రికార్డును అధిగమిస్తూ ఉష్ణోగ్రతలు నమోదవడం భూతాపం పెరుగుదల తీవ్ర స్థాయిలో ఉంది అనడానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఇది మానవాళి మనుగడకు పెనుముప్పుగా పరిగణించే అవకాశాలు ఉన్నాయని కోపర్నికస్ క్లైమేట్ చేంజ్ సర్వీసెస్ (CCCS) సంస్థ నివేదిక వెల్లడించింది.
భూమి మీద ఉష్ణోగ్రతలు ఈ విధంగా పెరగడానికి ముఖ్య కారణం గ్రీన్ హౌస్ వాయువులే (green house gasses) అని నివేదికలో స్పష్టం చేశారు.
మార్చి 2024లో భూమి సగటు ఉష్ణోగ్రత 14.4 డిగ్రీల సెల్సియస్ గా నమోదయిందని పేర్కొంది. పారిశ్రామికరణ (1850 – 1900) కంటే ముందు కంటే ఇది 1.68 డిగ్రీల సెల్సియస్ అధికము.
ఇప్పటివరకు మార్చి మాసంలో అధిక ఉష్ణోగ్రతలు 2016లో నమోదయ్యాయి. ఈ మార్చిలో అంతకంటే 0.10 డిగ్రీల సెన్సెస్ ఉష్ణోగ్రత అధికంగా నమోదయింది.
గడచిన 12 నెలల నుండి భూమి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదు అవుతున్న విషయం తెలిసిందే. పారిశ్రామికీకరణ కంటే ముందుతో పోలిస్తే ఈ ఉష్ణోగ్రతలు 1.58℃ అధికంగా నమోదు అవుతున్నాయి.
భూమి ఉష్ణోగ్రతల పెరుగుదలను 1.5 డిగ్రీల సెల్సియస్ కు పరిమితం చేయాలని పారిస్ ఒప్పందం నిర్దేశిస్తున్నా కూడా.. భూతాపం పెరుగుదల నెలనెల రికార్డులు నెలకోల్పుతుండడం శోచనీయం.
ఉష్ణోగ్రతలు ఈ విధంగా పెరగడం వలన ఇప్పటికే చాలా జీవరాశులు మనగడ కోల్పోయాయి. చివరికి మనిషి కూడా ఔ భూమి మీద నివసించే వాతావరణం లేకుండా ఉష్ణోగ్రతలకు పెరిగే అవకాశం ఉంది..