BIKKI NEWS (SEP. 10) : Mistakes in TG DSC 2024 Final Key. తెలంగాణ రాష్ట్ర డీఎస్సీ కి సంబంధించి పాఠశాల విద్య డైరెక్టరేట్ విడుదల చేసిన తుది కీ లోనూ తప్పులున్నట్టు అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Mistakes in TG DSC 2024 Final Key
పలువురు అభ్యర్థులు హైదరాబాద్ లోని డైరెక్టరేట్ కార్యాలయానికి వచ్చి అధికారులను ఈ అంశంపై కలిశారు. పాఠ్య పుస్తకాల ప్రకారం సమాధానాలు ఇవ్వలేదని, కొన్ని సమాధానాలు మార్చారని వివరించారు.
తప్పులున్న కీ ప్రకారం ఫలితాలు ప్రకటిస్తే తమకు అన్యాయం జరుగుతుందన్నారు.
అభ్యర్థుల అభ్యంతరాలపై అధికారులు స్పందించారు. మరోసారి పరిశీలన కమిటీకి అభ్యంతరాలను పంపుతామని చెప్పారు. ఒకవేళ తప్పులుంటే సరిచేసిన తర్వాత ఫలితాలు ప్రకటిస్తామని హామీ ఇచ్చారు.
డీఎస్సీ తుది కీని విద్యాశాఖ ఇటీవల విడుదల చేసింది. అందులో వచ్చిన ప్రశ్నలు టెట్లోనూ వచ్చాయి. వాటిల్లో సమాధానాలు ఒక రకంగా ఉంటే డీఎస్సీ ఫైనల్ కీలో మరోలా ఉన్నాయని అభ్యర్థులు తెలిపారు.