Home > CURRENT AFFAIRS > AWARDS > Miss Universe 2024 – విశ్వసుందరిగా విక్టోరియా కెజార హెల్విగ్‌

Miss Universe 2024 – విశ్వసుందరిగా విక్టోరియా కెజార హెల్విగ్‌

BIKKI NEWS (NOV. 17) : Miss Universe 2024 Victoria Kjaer Theilvig. 73వ మిస్‌ యూనివర్స్‌ పోటీలు 2024 లో డెన్మార్క్‌కు చెందిన 21 ఏళ్ల విక్టోరియా కెజార హెల్విగ్‌ విజేతగా నిలిచింది.

Miss Universe 2024 Victoria Kjaer Theilvig

మెక్సికో వేదికగా జరిగిన మిస్‌ యూనివర్స్‌ 2024 పోటీల్లో 125 మంది పోటీ పడగా.. విక్టోరియా విశ్వసుందరి కిరీటాన్ని దక్కించుకుంది.

విక్టోరియాకు 2023 మిస్‌ యూనివర్స్‌ షెన్నిస్‌ పలాసియోస్‌ విశ్వసుందరి కిరీటాన్ని అలంకరించింది.

ఈ మిస్‌ యూనివర్స్‌ పోటీల్లో నైజీరియాకు చెందిన చిడిమ్మ అడెట్షినా మొదటి రన్నరప్‌గా నిలిచింది. మెక్సికోకు చెందిన మరియా ఫెర్నాండా బెల్‌ట్రాన్‌ రెండో రన్నరప్‌గా నిలిచింది.

ఈ మిస్‌ యూనివర్స్‌ 2024 గ్రాండ్‌ ఫినాలేలో భారత్‌కు చెందిన రియా సింఘా కూడా పాల్గొంది. అయితే ఆమె టాప్‌ 30లోనే ఆగిపోయింది.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు